Sunday, 26 April 2015

పాన్ కార్డు దరఖాస్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆన్‌లైన్ విధానంలో కేవలం 48 గంటల్లోనే పాన్ కార్డు జారీ చేయనున్నట్లు  తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వారు సైతం పాన్ కార్డులు పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు .
మనదేశంలో పాన్ కార్డుని ఐటీ శాఖ జారీ చేస్తుంది. పాన్ కార్డుని పొందేందుకు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు ఉండే సరిపోతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు సమర్పించాలన్నా, నిర్ధిష్ట విలువకు మించి ఆస్తులు, వాహనాల క్రమ, విక్రయాలు జరపాలన్నా పాన్ కార్డుని ప్రభుత్వం తప్పనిసరి చేసింది  గమనించగలరు.


     ధన్యవాధములు 
    శ్రీకంఠం రమణయ్య

No comments: