Thursday, 21 September 2017

సెప్టెంబరు 24 వ తేది మీటింగ్

Tuesday, 20 June 2017

సేవలు - సంప్రదించవలసిన నెంబర్లు

ఈ నెంబర్లకు కాల్ చెయ్యండి. సంబంధిత విభాగానికి ఫోన్‌చేస్తే - సేవలు అందిస్తారు
📞

155361: ప్రభుత్వ కార్యాలయాలకు మీరు వెళ్ళినపుడు అక్కడ మిమ్నల్ని ఇబ్బందులు పెడుతున్నారా?
📞

100: ఎక్కడైనా ఏదైనా కొట్లాట జరుగుతున్నదా.. శాంతిభద్రతలను కాపాడాలి అంటే.. ఇలా పలు నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకుంటే ఎంతో ఉపయోగం.
📞

101: ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సంబందిత స్థలం, వంటి వివరాలతో ఫోన్‌ చేయాల్సిన నెంబరు
📞

104: గ్రామీణ ప్రాంతాలలో వైద్యసేవలను అందించేందుకు మొబైల్‌ వైద్య సర్వీసులను పిలిచేందుకు.
📞

108:
ఎక్కడైనా ఎవరైనా ఆకస్మికంగా ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతుంటే వారిని అత్యవసరంగా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించాంటే వైద్యసేవలకోసం.
📞

1090:
శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు సరిగా పని చేయడంలేదా, దరఖాస్తులు ఇచ్చినా తీసుకోవడం లేదా అయితే పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే ఎవరికి చేయాలో తెలియదా, అయితే ఫిర్యాదు కోసం.
📞

1091:
మీకు ఎక్కడైనా ఈవ్‌ టీజింగ్‌ దృశ్యాలు కనిపించాయా? వరకట్నం కారణంగా ఇబ్బందులు పడుతున్నారా? ఇటువంటి వాటితో పాటు అత్తమామల హింసలను, అకతాయిల అగడాలను గురించి సమాచారం కోసం.
📞

1098:
6 నుంచి 14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలపై వేధింపులు జరుగుతున్నాయా? ఎక్కడైనా తప్పి పోయారా వంటి వాటిపై సమాచారం ఇచ్చేందుకు.
📞

1100:
మీ సేవా కేంద్రాలు సరిగా పనిచేయడం లేదా? దరఖాస్తు చేసుకున్న ధృవ పత్రాలను నిర్ణీత సమయంలోగా ఇవ్వడం వంటి తదితర అంశాలపై ఫిర్యాదు కోసం.
📞

1500: బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు సంబంధించిన సమాచారం కోసం
📞

133355: విద్యుత్‌ సమస్యలకు సంబంధించి సమాచారం కోసం
📞

155321: ఉపాధి హామీ పధకంలో కూలీలకు అన్యాయం జరుగుతోందా? కూలీ డబ్బులు ఇవ్వడం లేదా అయితే..
📞

155361: ప్రభుత్వ కార్యాలయాలకు మీరు వెళ్ళినపుడు అక్కడ మిమ్నల్ని ఇబ్బందులు పెడుతున్నారా?
📞

1800-180-5232: తపాల బీమాలో చేరాలనుంకటే వివిధ వివరాలకు..
📞

1800-200-4599:
ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోయినా, బస్సులలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా..
📞

1800-425-3536:
రైతులకు పంటసాగులో సమాచారం కోసం
జాబ్స్ కి సంబందించిన సమాచారం అయిన,
హాస్పిటల్స్ కి సంబందించిన సమాచారం అయిన,
మంచి స్కూల్ కి సంబందించిన సమాచారం అయిన
మీకు ఎలాంటి సమాచారం అయిన
ఈ యాప్ ద్వారా మీరు పొందవచ్చు.
https://drive.google.com/file/d/0B-8WbwkutteIaTZMYkhwN3VxSEU/view?usp=drivesdk
మీకు తెలిసిన  విషయాన్ని మీ స్నేహితులకు తెలియ చేయండి.10 మంది ప్రయోజనం పొందిన చాలు.ఏదైనా కారణాల చేత ఫోన్ లిఫ్ట్ చేయక ఆన్సర్ చేయకపోతే మాకు మాత్రం చేయకండి ప్లీజ్.

Monday, 10 April 2017

Dear Sir/Madam,
New committee was  elected by the members on 09/04/2017 in  Annual General Meeting which was held at 16-7-263, Nature Heaven apartment Mr.Munukuru Ramachandra Reddy as President,Mr.Putta Venkata Sesha Reddy as vice President,Srikantam Ramanaiah as Secretary and Gummidela Ramadevi as Treasurer and Mr. Puchapalli Gopal Reddy as Jt.Secretary,Smt Pelluru Nirmala,Mr.Tarigopula Venkateswara Rao, Mr.Devarapalli Venkata Reddy, Mr. D S Chandra Guptha, Mr.Perneti Gopal Reddy,Dr. Annadevula Satish Chandra Reddy and Mr. Mannem ChandraSekhara Reddy.are as Executive Committee  Members
   The committee is decided to collect membership fee Rs,1000/- for the accounting year 2017-18, and also decided the committee will not collect the garbage charges from the members for this accounting year.
   All the Ramamurthy Nagar Owners/Members are request to co-operate and pay the annual subscription by this month ending.
  With Regarads

Secretary
Srikantam Ramanaiah
10/04/2017

Tuesday, 21 March 2017

ఆహార వేటలో సాగే దోమకు మనిషిని గుర్తించేందుకు మూడు రకాల గ్రాహకాలు తోడ్పడతాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. దృశ్య పరమైన గ్రాహకంతో పాటు వాసనను గ్రహించడం, శరీరం నుంచి వెలువడే వేడి ద్వారా మనిషిని గుర్తించి తీరిగ్గా రక్తాన్ని జుర్రుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వీటి బారినుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదని తెలిసిందే అయినా మార్కెట్లో లభించే రకరకాల రిపెల్లెంట్‌లు ఉపయోగిస్తుంటాం. అయితే దోమల ముందు వీటి పప్పులేం ఉడకవట. మహా అయితే కాసేపు దూరం పెట్టగలవేమో కానీ వాటిని పూర్తిగా అడ్డుకోవడం ఈ రిపెల్లెంట్‌ల వల్ల కాదని శాస్త్రవేత్తలు వివరించారు. పిల్లల ఆకలిని తీర్చేందుకు ఆహారాన్ని(రక్తాన్ని) వెతుకుతూ బయలుదేరిన ఆడదోమ మనిషిని అల్లంత దూరం నుంచే గుర్తిస్తుందని చెప్పారు. ‘మనిషితో పాటు ఇతర ప్రాణులు వదిలే శ్వాసను, అందులోని కార్బన్‌ డయాక్సైడ్‌ను సుమారు 50 మీటర్ల దూరం నుంచే గుర్తించి అటుగా ఎగురుతుంది. అలా 15 మీటర్ల దూరంలోకి రాగానే తన కళ్లకు పనిచెబుతుంది. దీంతో దోమ పదిహేను మీటర్ల దూరం వరకు చూడగలదని తేలిపోయింది. ఆపై మనిషి సమీపంలోకి అంటే దాదాపు మీటరు దూరంలోకి వచ్చాక టార్గెట్‌ శరీరం నుంచి వెలువడే ఉష్ణోగ్రతను గుర్తించి ముందుకు సాగుతుంది’ అని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ మైకెల్‌ డికిన్సన్‌ వివరించారు. ఆహార వేటలో దోమకు తోడ్పడే అంశాలేమిటనే దిశగా తాము నిర్వహించిన ప్రయోగంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని వివరించారు. ఇందుకోసంవీడియో కెమెరాలతో పాటు త్రీడీ ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో దోమలను పరీక్షించినట్లు మైకెల్‌ తెలిపారు.

Sunday, 19 March 2017

దొంగతనాల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
 టూర్లకు, ఊర్లకు వెళ్లేవారు విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లాలి.
 తాళం చెవి ఇంటి పరిసర ప్రాంతాలలో పెట్టకూడదు.
 ఇంటి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలి.
దూర ప్రాంతాలకు, ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు
తప్పకుండా సంబంధిత PS పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
 అనుమానాస్పద వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు.
 బంగారాన్ని మెరుగు పెడతామని చెప్పేవారిని నమ్మొద్దు.
 మహిళలు ఒంటరిగా బయటకు వెళ్తే మెడచుట్టూ కొంగును, ప్రత్యేక వస్త్రంతో కనిపించకుండా ఉంచాలి.
 విలువైన వస్తువుల సమాచారాన్ని ఇతరులకు చెప్పకూడదు.
 ఆరుబయట వాహనాలకు హాండిల్‌లాక్‌తో పాటు వీల్‌ లాక్‌ వేయాలి.
 గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్‌, పాలవారిని రావద్దని చెప్పాలి.
సమీపస్తులను గానీ పని మనుషులను గానీ ప్రతీరోజు వాకిలి ఊడ్చమని చెప్పాలి.
 ఇళ్ల ముందు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
 నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి,
ఇరుగుపొరుగు వారికి మీ మొబైల్ నెంబరు ఇవ్వడం మంచిది
 టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి.
కొత్త వ్యక్తుల కదళికలపై 100 డయల్‌ లేదా 9390777727,9440796311 పోలీసు వాట్సాప్‌ నెంబర్‌కు
సమాచారం ఇవ్వాలి.

Wednesday, 8 March 2017



ఆకాశంలో సగమా :
అబధ్ధం

అణువణువునా నువ్వే స్త్రీ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు... ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా ఆమె కాలూనని రంగం లేదు... ఆమె ధైర్యం ఓ హిమవన్నగం... ఆమె ఆప్యాయత నదీ తరంగం.... ఆమె ప్రేమ విశ్వజనీనం.... ఆమె కీర్తి విశ్వవ్యాప్తం.... "అంతర్జాతీయ మహిళా" దినోత్సవ శుభాకాంక్షలు  మన రామముర్తినగర్ మహిళలందరికీ

శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి
ఆకాశంలో సగమా :
అబధ్ధం
అణువణువునా నువ్వే స్త్రీ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు... ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా ఆమె కాలూనని రంగం లేదు... ఆమె ధైర్యం ఓ హిమవన్నగం... ఆమె ఆప్యాయత నదీ తరంగం.... ఆమె ప్రేమ విశ్వజనీనం.... ఆమె కీర్తి విశ్వవ్యాప్తం.... "అంతర్జాతీయ మహిళా" దినోత్సవ శుభాకాంక్షలు  మన రామముర్తినగర్ మహిళలందరికీ

    శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి,రామముర్తినగర్  ఓనర్స్అసోసియేషన్

Friday, 3 March 2017

ఉపాధ్యాయ/పట్టభద్ర ఓటరూ పోటీలో ఉన్న అంత మంది అభ్యర్దుల పేర్ల ఎదురుగా తమకిష్టమైన ప్రాధాన్యతా క్రమంలో 1,2,3,...,18నెంబర్లు వ్రాసి పోటీలో ఉన్న అందరు అభ్యర్దులకూ ఓటు వేయవచ్చు. మీరు 1 వ్రాసిన అభ్యర్దికి మీ ఓటు మొదట నమోదు అవుతుంది.
ఇక్కడ 18 మందిలో ఎక్కువ మొదటి (1) ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్ది వెంటనే గెలవడు, ఎవరు గెలవాలన్నా వారికి మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. అలా వచ్చే వరకూ, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్దులను ఎలిమినేట్ చేస్తూ, ఎలిమినేట్ అయిన అభ్యర్దులకు నమోదైన ఓట్లను, ఓటరు వ్రాసిన ప్రాధాన్యతా క్రమంలో పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్దులకు బదలాయిస్తారు.
మీరు 1 వేసిన అభ్యర్ది చివరివరకూ పోటీలొ నిలబడలేకపోతే మీరు 2 వ్రాసిన అభ్యర్దికి మీ ఓటును లెక్కిస్తారు, ఆ అభ్యర్దీ మధ్యలోనే ఎలిమినేట్ అయితే, మీరు 3 వ్రాసిన అభ్యర్దికి మీ ఓటును లెక్కిస్తారు.. అలా గరిష్ఠంగా 18 సార్లు మీ ఓటు లెక్కించబడే అవకాశం ఉంది.
కాబట్టి విద్యావంతులైన పట్టభద్ర ఓటర్లు ఏ ఒక్కరికో మాత్రమే మీ ఓటు వేయాల్సిన అవసరం లేదు; బాగా ఆలోచించి, మీకిష్టమైన అభ్యర్దులందరికీ మీకు నచ్చిన ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయండి.
ఎవరైనా ఒక్క అభ్యర్థికే ప్రాధాన్యత తెలిపితే ఆ ఒక్కరికే ఓటు లెక్కించబడుతుంది

ఈ నెల 9వ తేది శాసనమండలి పట్టభద్ర/ఉపాద్యాయ ఎన్నిక జరుగుతుంది

Saturday, 18 February 2017

సూచనలు 
ఓటరు గుర్తింపు కార్డు.. 
ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్‌బూత్‌, కార్డు నెంబర్‌తో రూ. 10 రుసుం చెల్లించిమీ సేవా కేంద్రంలో మళ్లీ పొందవచ్చు. కార్డు నెంబరు ఆధారంగా తహశీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం www.ceoandhra.nic.in  వెబ్‌సైట్ సందర్శించి వివరాలను పొందవచ్చు. 
 
 
పాన్‌ కార్డు 
పాన్‌ కార్డు పొగొట్టుకుంటే సంబంఽధిత ఏజన్సీలో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు పాత పాన్‌ కార్డు జిరాక్స్‌, రెండు కలర్‌ ఫోటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డు కోసం అదనంగా మరో రూ.90 చెల్లించాలి. కొత్త కార్డు వచ్చేసరికి మూడు వారాల సమయం పట్టవచ్చు www.nsdl.pan వెబ్‌సైట్‌లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
 
రేషన్‌ కార్డు.. 
రేషన్‌ కార్డు పోగొట్టుకున్న వారు www. icfs2. ap.gov.in,  వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. అక్కడ ఉన్నusername; guest,password;guest123 సాయంతో విచారణను ఉపయోగించి రేషన్‌కార్డు నెంబర్‌ సాయం తో జిరాక్స్‌ ప్రతిని పొందవచ్చు. దాని ద్వారా ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే తహశీల్దార్‌ దానిని పరిశీలించి నామమాత్రపు రుసుంతో అదే నెంబరుపై కార్డు జారీ చేస్తారు.
 
ఆధార్‌ కార్డు .. 
ఆధార్‌ కార్డుపోతే టోల్‌ ఫ్రీ నెంబరు 1800 1801947 పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. రుసుం, చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త కార్డు మళ్లీ పోస్టులో పంపిస్తారు. help@uidai.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. 
 
 
పాస్‌పోర్టు.. 
పాస్‌పోర్టు పో గొట్టుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చే యాలి. వారు విచారణ జరిపి నాన్‌ ట్రేస్డ్‌ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌పోర్టు అధికారి. హైదరాబాద్‌ పేరిట రూ.వెయ్యి డీడీ తీయాలి. రెండింటిని జతపరిచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ చేసి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. మూడు నెలల తరువాత డూప్లికేట్‌ పాస్‌ పోర్టు జారీ చేస్తారు. తత్కాల్‌ పాస్‌ పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. వివరాలకు www.passportindia.gov.in ను సంప్రదించటం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
 
ఏటీఎం కార్డు.. 
ఏటిఎం కార్డు ను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగతనం చేసినా ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్‌ చేయించాలి. తరువాత బ్యాంకులో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. మేనేజర్‌ ఈ విషయాన్ని నిర్ధారించుకొని కొత్త కార్డును జారీ చేస్తారు. ఇందుకోసం నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి.
 
 
డ్రైవింగ్‌ లైసెన్స్‌ .. 
డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోగొట్టుకున్న వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్‌ ట్రేస్డ్‌ పత్రంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ప్రతిని ఎల్‌ఎల్‌డీ దరఖాస్తుకు జత చేసి ఆర్డీవో కార్యాలయంలో అందించాలి. రూ. పది బాండ్‌ పేపర్‌పై కార్డు పోవటానికి కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది. నెల రోజుల్లో తిరిగి కార్డు పొందేందుకు అవకాశం ఉంది. ఏపీకి చెందిన వాళ్లు aptransport.org,  అనే వెబ్‌సైట్‌ నుంచి ఎల్‌ ఎల్‌డీ పారం డౌన్‌లోడ్‌ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు.
 
కార్డు హోల్డర్లకు సూచనలు 
కార్డు ఏదైనా స్కాన్‌ చేయించి ఈ మెయిల్‌ అడ్ర్‌సకు అప్‌లోడ్‌ చేసి స్టోర్‌ చేసుకోవడం చాలా మంచిది.ప్రధాన కార్డులను డూప్లికేట్‌ చేయించుకుని వాటినే జేబులో పెట్టుకు తిరగాలి. ముఖ్యమైన కార్డులు ప్రత్యేక వాలెట్‌ పెట్టుకుంటే మంచిది.

Wednesday, 1 February 2017

రాత్రి సమయంలో మీరు కారులో వెళ్తుండగా మీకారు అద్దంపై కోడిగుడ్డు పడిందా? అయితే ఎట్టి పరిస్తితుల్లోను మీరు కారు ఆపవద్దని  పోలీసులు చెబుతున్నారు. అంతేకాక వైపర్ ఆన్ చేసి నీటితో కారు గ్లాసు (అద్దం) శుభ్రం చేయాలని ప్రయత్నించొద్దని కూడా వారు హెచ్చరిస్తున్నారు. అలా ప్రయత్నిస్తే కోడిగుడ్డులోని రసాయనాలు నీటితో కలయొక చెంది అద్దంపై నల్లటి పొర ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో వెంటనే అంతా చీకటిగా తయారయి, బయట ఏమీ కనబడదని, అప్పుడు తప్పనిసరిగా కారు ఆపవలసి వస్తుందని, ఆ వెంటనే దారి దొపిడీ దొంగలు మీ మీద దాడి చేసి మీ విలువైన వస్తువులు, నగదు దోపిడీ చేసే అవకాశం వుందని వారు హెచ్చరిస్తున్నారు. కావున జాగ్రత్త ఇలాంటి సంఘటనలు ఎదురైతే కాస్త జాగ్రత్తగా వ్యవహరించి దోపిడీదారులకు చిక్కకుండా తప్పించుకోవాలని  పోలీసులు సూచించారు.

Friday, 13 January 2017

సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరికి మాకుటుంబమందరి తరఫున శుభాకాంక్షలు. పాత సంవత్సరములో పూర్తికాని మీ ఆశలు,ఆకాంక్షలు కొత్త సంవత్సరములో నెరవేరాలని నూతనమైన ఆలోచనలతో, లక్ష్యాలతో మీరు ముందడుగు వేయాలని అవి సఫలీకృతం కావాలని ఆ పరమాత్మని ప్రార్ధిస్తున్నాను. మీరు నమ్మిన దేవుని పై విశ్వాసంతో,ప్రార్ధనచేయండి. ఈ సంవత్సరం నిత్య నూతనంగా, ఆనందమయంగా ఉండాలని ఆకాంక్ష,శుభాకాంక్ష
శ్రీకంఠం రమణయ్య

Tuesday, 10 January 2017

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ)- కింద పేర్కొన్న స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 11
చీఫ్‌ మేనేజర్‌(రిస్క్‌ మేనేజ్‌మెంట్‌)ఖాళీలు: 3
అనుభవం: ఏడేళ్లు
వయసు: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
మేనేజర్‌(రిస్క్‌ మేనేజ్‌మెంట్‌) ఖాళీలు: 3
అనుభవం: అయిదేళ్లు
వయసు: 26 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: సీఏ/ ఎంబిఏ(ఫైనాన్స్) పూర్తిచేసి ఉండాలి. ఎఫ్‌ఆర్‌ఎం/ పిఆర్‌ఎం చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒరాకిల్‌/ ఎనపిఎస్‌ఎస్‌పై అవగాహన ఉండాలి.
మేనేజర్‌(స్టాటిస్టీషియన) ఖాళీలు: 3
అర్హత: ఎమ్మెస్సీ(స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు ఒరాకిల్‌/ ఎన్‌పిఎస్‌ఎస్‌ పై అవగాహన ఉండాలి. ఏడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
చీఫ్‌ మేనేజర్‌(ఫోరెక్స్‌) ఖాళీలు: 1
అర్హత: ఎంబిఏ/ పీజీడిబిఎం(ఫైనాన్స్) ఉత్తీర్ణతతోపాటు ఏడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
డిప్యూటీ మేనేజర్‌(ఇంట్రెస్ట్‌ రేట్‌ మార్కెట్‌)
ఖాళీలు: 1
అర్హత: ఎంబిఏ/ పీజీడిబిఎం(ఫైనాన్స్) ఉత్తీర్ణతతోపాటు అయిదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జనవరి 13
దరఖాస్తు ప్రింటు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: జనవరి 20
చిరునామా: భారతదేశం, సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ శాఖ, కార్పొరేట్ సెంటర్, 3 వ అంతస్తు, అట్లాంటా బిల్డింగ్, నారిమన్ పాయింట్, ముంబాయి 400021 స్టేట్ బ్యాంక్
వెబ్సైట్: www.statebankofindia.com