Saturday, 29 October 2016

దీపావళీ ఐదు రోజుల పండుగ !!
దీపావళీ పండుగ శుభాకాంక్షలు !!
1 - ధన్వంతరీ త్రయెాదశి - వాడుకలో ధన త్రయెాదశి
అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం
కానీ ఆరోజు "ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు
శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన "ధన్వంతరీ భగవాన్"
జయంతి ! పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో
అమృతభాండముతో అవతరించాడు !!
2 - నరక చతుర్దశి - నరక యాతనల నుండి రక్షించమని
యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి ! నరకుడు చనిపోయిన రోజు కూడా
ప్రాక్జ్యోతీషపురం(నేటి అస్సాము) ను పాలించే ' నరకుడు'
నర రూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుతశక్తులను
సంపాదించి దేవతలను కూడా ఓడించాడు ! వాడు ప్రతీ
అమావాస్య- పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను బలి
ఇచ్చేవాడు ! కాముకత్వంతో అనభవించేవాడు ! నరకుని
చెరసాలలో వేలాది అందమైన మహిళలు బందీలుగా వుండేవారు ! ఆది వరాహ మూర్తికి - భూదేవికి కలిగిన
సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జనించాడు !
శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ(భూదేవీ అవతారం)తో
కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని
శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు !
నరకుని పీడ విరగడైంది కావున ఇది 'నరక చతుర్దశి' !!
3 - దీపావళీ - రావణ సంహారం తర్వాత సీతారాములు
అయెాధ్యకు వచ్చిన శుభ సంధర్భఁగా దీపావళి జరుపు
కోవాటం , నరకుని బాధలనుండి విముక్తి లభించిన ఆనందం
లో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం !!
దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞానస్వరూపం
అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము !!
వ్వాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు !!
4 - బలి పాఢ్యమి - వామనావతారంలో శ్రీమన్నారాయణుడు
బలి చక్రవర్తిని 'మూడు అడుగుల' నేలను దానమడిగాడు !
వామన వటువు కు దానమిచ్చాడు బలి, "ఇంతింతై వటుడింతై
నభోరాశిపై నల్లంతై" అన్నట్లుగా ఒకపాదంతో భూమిని, ఇంకోపాదంతో
 ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు !
 సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి 
ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని 
ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం !!
5 - యమద్వితీయ - సూర్యభగవానునికి యముడు - శని
దేవుడు ఇద్దరు పుత్రులు ! యమున అనే ఒక పుత్రిక కలదు !
యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తన
పని (జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశం తో 
ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగినన శిక్షలు 
విధించే పని)లో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం
లేదు యముడు !! చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా !!
 అని కార్తీక శుద్ఘ విదియ రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా 
కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు !! చెల్లెలైన యముున అన్నయ్యను ఒక
వరం అడిగింది ! ఎవరైతే ఈరోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుకలిచ్చి
 వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది !!
ఈ యమునమ్మనే యమునా నది ! కృష్ణ భక్తురాలు !
"భగినీ హస్త భోజనం" పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ
ఇప్పటికీ జరుపుకుంటారు !! ఇదీ ఐదు పండుగల కథ !!
విశ్వశాంతి వర్ధిల్లును గాక ! శుభమ్ భూయాత్ !

     ధన్యవాధములు 
    శ్రీకంఠం రమణయ్య

Tuesday, 18 October 2016

పట్టభద్రుల  శాసనమండలి ఎన్నికల్లో ఓటేయాలంటే ప్రభుత్వం ceoandhra.nic.inఆన్‌లైన్‌లో పొందుపరచిన వెబ్‌సైట్‌లో  (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓటరుగా) నమోదు చేసుకోండి
  • ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
  • నవంబరు  2,2013వ తేదీ నాటికి పట్టభద్రుడై ఉండాలి
  • (విద్యార్హతను పరీక్షా ఫలితాలు ప్రకటించిననాటి నుంచే లెక్కిస్తారు)శాసనసభ నియోజకవర్గంలో ఓటరుగా ఉంటే ఆ వివరాలు పొందుపరిస్తే మంచిది
  • దరఖాస్తుతో ఫోటో తప్పనిసరిగా Degree జెరాక్స్ కాపి జతపరచాలి
  • డాక్టర్లు, ఆడిటర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వారి వారి రిజిష్టర్డ్  అర్హతను ధ్రువీకరించుకోవచ్చు.
  • ఒకే కుటుంబంలో పట్టభద్రులు ఉంటే అందరి దరఖాస్తులు కుటుంబ వ్యక్తి తీసుకెళ్లి సమర్పించి, రసీదు పొందవచ్చు, మనకు నమోదు అధికారి నెల్లూరు  R D O గారు.
                                                                     ధన్యవాధములు 
                                                                                                                                                                                                                                     శ్రీకంఠం రమణయ్య
                                                                                                                                                                                                                                              కార్యదర్శి
                                                                                                                                                                                                             రామముర్తినగర్ ఓనర్స్ అసోసియేషన్,నెల్లూరు

Friday, 14 October 2016

పట్టభద్రుల  శాసనమండలి ఎన్నికల్లో ఓటేయాలంటే ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పొందుపరచిన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోండి. (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓటరుగా)
  • ప్రతి ఒక పట్టభద్రుడు ఓటు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి
  • నవంబరు 2013 ఒకటవ తేదీ నాటికి పట్టభద్రుడై ఉండాలి
  • విద్యార్హతను పరీక్షా ఫలితాలు ప్రకటించిననాటి నుంచే లెక్కిస్తారు
  • శాసనసభ నియోజకవర్గంలో ఓటరుగా ఉంటే ఆ వివరాలు పొందుపరిస్తే మంచిది
  • దరఖాస్తుతో ఫోటో తప్పనిసరిగా జతపరచాలి
  • ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్నవారు తమ సంస్థ అధికారి ద్వారా ధ్రువీకరణపత్రం జతపరచి సంస్థలోని వారందరి దరఖాస్తులు ఒకే వ్యక్తి ద్వారా పంపవచ్చును. వీరు డిగ్రీ సర్టిఫికేట్లు జిరాక్స్‌ కాపీలు జతపరచనక్కర్లేదు. ఆ అధికారికి గెజిటెడ్‌ హోదా ఉండాలి
  • డాక్టర్లు, ఆడిటర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, రిజిస్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ప్రాక్టీస్‌, రూల్స్‌ ఆఫ్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌, రిజిస్టర్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ తమ అర్హతను ధ్రువీకరించుకోవచ్చు.
  • ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులు డిగ్రీ సర్టిఫికేట్‌ జిరాక్స్‌కాపీని  గెజిటెడ్‌ అధికారి చేత ధ్రువీకరించి దరఖాస్తుకు జతపరచాలి. ఆ దరఖాస్తును వ్యక్తిగతంగా ఓటరు నమోదు అధికారికి అందజేసి రసీదు పొందాలి. దరఖాస్తు స్వీకరించే అధికారికి ఒరిజినల్‌ సర్టిఫికేట్స్‌ చూపాల్సి ఉంటుంది.
  • ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేవారు సీఈవో ఆంధ్రా.ఎన్‌ఐసీ.ఇన్‌ (నాల్గవ రకం ఏబీసీడీ) వెబ్‌సైట్‌ నందు ఇ-రిజిసే్ట్రషన్‌ కౌన్సిల్‌ ఠి ఫోరం18లోనికి వెళ్లి నమోదు చేయాలి. ఫోటో ధ్రువీకరించి సర్టిఫికేట్స్‌ స్కాన్‌చేసి అప్‌లోడ్‌ చేయాలి
  • దరఖాస్తులు మొత్తంగా ఒకటికంటే ఎక్కువగా ఒకే వ్యక్తి తీసుకెళ్లి సమర్పించే వీలులేదు
  • ఒకే కుటుంబంలో పట్టభద్రులు ఉంటే అందరివి ఒకే వ్యక్తి తీసుకెళ్లి సమర్పించి రసీదు పొందవచ్చు, మనకు నెల్లూరుమున్సిపల్‌ కార్పోరేషన్ కమిషనర్ (నమోదు అధికారి)
  • అసోసియేషన్ ద్వారా ఓటరు దరఖాస్తులను సేకరించి అధికారులకు సమర్పించే వీలులేదు.

Thursday, 13 October 2016

స్టాఫ్‌ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి)- వివిధ విభాగాల్లో ఉన్న 5134 పోస్టుల భర్తీకోసం భారీ నోటిఫికేషన విడుదల చేసింది. పోస్టల్‌ అసిస్టెంట్స్‌/ సోర్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 3281, ఎల్‌డిసి పోస్టులు 1321, డిఇఒ పోస్టులు 506 కాగా కోర్టు క్లర్క్‌ 26 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. 2017 జనవరి 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ దరఖాస్తుకు అర్హులు.
 
ఫీజు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు/ మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కంప్యూటర్‌ బేస్డ్‌ రిటెన ఎగ్జామినేషన, డిస్ర్కిప్టివ్‌ పేపర్‌, టైపింగ్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. నవంబరు 7 లోపు అభ్యర్థులు ఆనలైనలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 5 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌, ఏప్రిల్‌ 9న డిస్ర్కిప్టివ్‌ పేపర్‌ ఎగ్జామ్‌ జరుగుతాయి. పూర్తి వివరాల కోసం www.ssconline.nic.in

Thursday, 6 October 2016

ఉద్యోగ నోటిఫికేషన్స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ)- రెగ్యులర్‌/ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకోసం ప్రకటన విడుదల చేసింది.
 
మొత్తం ఖాళీలు: 412
 రెగ్యులర్‌ పోస్టులు
 అసిస్టెంట్‌ మేనేజర్‌(సిస్టమ్‌)
 ఖాళీలు: 180(జనరల్‌ అభ్యర్థులకు 92 పోస్టులను కేటాయించారు)
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
 
అర్హత: (బిఇ/బిటెక్‌/ ఎమ్మెస్సీ)(కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ & టెలికమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌)/ ఎంసిఏ ఉత్తీర్ణులై ఉండాలి.
 
అనుభవం: కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
 
డెవలపర్‌ ఖాళీలు: 50
 విభాగాలు: ఎస్‌పి- 1, ఎల్‌ఎంఎస్‌, కోర్‌ బ్యాంకింగ్‌ ఎస్‌పి- 2, ఐటి-టిఎస్‌ఎస్‌, మొబైల్‌, ఐఎన్‌బి, ఎటిఎం, ఐటిఎఫ్‌ఒ, ఒపిఎస్‌్క్ష టిఎస్‌, ఒపిఎస్‌్క్ష పిఎస్‌, ఎఫ్‌ఐజిఎస్‌, కంప్లైంట్స్‌, ఎస్‌పి -3, ఎస్‌ఎం & డబ్ల్యు
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
 అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
 అనుభవం: ఐటి బిజినెస్‌/ ఇండస్ట్రీ ఇన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అప్లికేషన్స్‌లో అయిదేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ సంబంధిత స్కిల్స్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
 టెస్ట్‌ లీడ్‌ ఖాళీలు: 2
 వయసు: 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
 
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉండాలి.
 
అనుభవం: ఐటి సెక్టార్‌లో టెస్టింగ్‌కు సంబంధించి ఆరేళ్ల అనుభవం ఉండాలి. టీమ్‌ లీడర్‌గా రెండేళ్లు పనిచేసి ఉండాలి
 
టెస్టర్‌ ఖాళీలు: 12
 వయసు: 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
 అర్హత- అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి టెస్టింగ్‌లోనాలుగేళ్లఅనుభవం ఉండాలి.
డెవలపర్‌(టెస్ట్‌ లీడ్‌ & టెస్టర్‌)
 
ఖాళీలు: 64(జనరల్‌ అభ్యర్థులకు 34 పోస్టులు కేటాయించారు)
 మేనేజర్‌(స్టాటిస్టీషియన్‌)
 ఖాళీలు: 7(జనరల్‌ అభ్యర్థులకు 5 పోస్టులు కేటాయించారు)
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత- అనుభవం: 60 శాతం మార్కులతో పీజీ(స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
 అసిస్టెంట్‌ మేనేజర్‌ (స్టాటిస్టీషియన్‌)
 ఖాళీలు: 20(జనరల్‌ అభ్యర్థులకు 11 పోస్టులు కేటాయించారు)
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత- అనుభవం: 60 శాతం మార్కులతో డిగ్రీ (స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి.
 పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్‌ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
 కాంట్రాక్ట్‌ పోస్టులు
 టెక్నాలజీ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌
 ఖాళీలు: 4(జనరల్‌ అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు)
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 28 నుంచి 40 ఏళ్లమధ్య ఉండాలి.
 అర్హత - అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐటి ఇండస్ట్రీలో ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. దీనిలో అయిదేళ్లు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌కు సంబంధించి పనిచేసి ఉండాలి.
 అడ్మిన్‌ సపోర్ట్‌ ఆఫీసర్‌(ఎంఎబి) ఖాళీలు: 1
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
 
అర్హత- అనుభవం: ఎంబిఏ(మార్కెటింగ్‌/ ఆపరేషన్స్‌) పూర్తిచేసి ఉండాలి. ఇంజనీరింగ్‌ డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఐటి ఇండస్ట్రీలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి
 అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్‌(ఐఎన్‌బి, మొబైల్‌) ఖాళీలు: 2
 వయసు: 28 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఐటి ఇండస్ట్రీలో 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
 
బిజినెస్‌ ఆర్కిటెక్ట్‌(ఇ ్క్ష టిఏ) 1, డేటా వేర్‌హౌస్‌ ఆర్కిటెక్ట్‌ (ఐడిఎస్‌పిఎం)1, ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్ట్‌(ఇ్క్షటిఏ) 2, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆర్కిటెక్ట్‌(డిసి్క్ష బిసిఎం, డిఆర్‌సి, ఐటిఎఫ్‌ఒ, పిఇ-1, పిఇ-2, టెక్‌ ఒపి, ఎన్‌డబ్ల్యు  & కమ్యూనికేషన్స్‌) 6
 
వయసు: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత- అనుభవం: బిఇ/బిటెక్‌(సిఎస్‌/ఐటి/ఇసిఇ)/ ఎంసిఏ ఉత్తీర్ణతతోపాటు ఐటి ఇండస్ట్రీలో 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
 పోర్టల్‌ ఆర్కిటెక్ట్‌(ఎస్‌ఎం్క్ష డబ్ల్యు) ఖాళీలు: 1
 వయసు: 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత- అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ+ఐటి ఇండస్ట్రీలో ఆరేళ్ల అనుభవం ఉండాలి)
టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌(ఐఎన్‌బి, ఇ్క్ష టిఏ, ఒపిఎస్‌ & పిఎస్‌)
 ఖాళీలు: 5
 వయసు: 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత- అనుభవం: ఐటి ఇండస్ట్రీలో పదేళ్ల అనుభవం ఉండాలి
 
పోస్టులు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీర్‌ 9, సివిల్‌ ఇంజనీర్‌ 1, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ 1, టెక్నికల్‌ ఇంజనీర్‌ 1, నెట్‌వర్క్‌ ఇంజనీర్‌ 2
 వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీతోపాటు ఐటి ఇండస్ట్రీలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి
 పోస్టులు: కంప్లైంట్‌/ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ ఆఫీసర్‌ 2, ఐటి రిస్క్‌ మేనేజర్‌ 2, ఐటి సెక్యూరిటి ఎక్స్‌పర్ట్‌ 2
 వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 ప్రాజెక్ట్‌ మేనేజర్‌
 ఖాళీలు: 29(జనరల్‌ అభ్యర్థులకు 16 పోస్టులు కేటాయించారు)
 బిజినెస్‌ అనలిస్ట్‌
 ఖాళీలు: 18(జనరల్‌ అభ్యర్థులకు 11 పోస్టులు కేటాయించారు)
 
డెవలపర్‌ (హెచ్‌ఆర్‌ఎంఎస్‌, ఎటిఎం, ఐఎన్‌బి, ఇపే, ఐటిఎఫ్‌ఒ, ఐటిటిఎస్‌ఎస్‌, ఎల్‌ఎంఎస్‌, మొబైల్‌, ఒపిఎస్‌్క్ష పిఎస్‌, ఒపిఎస్‌్క్ష టిఎస్‌, ఎస్‌పి - 3, ఎస్‌పి - 1)
 
ఖాళీలు: 22 (జనరల్‌ అభ్యర్థులకు 12 పోస్టులు కేటాయించారు)
 
టెస్టర్‌(ఐఎన్‌బి) 5, టెస్ట్‌ లీడ్‌(యుఎటి) 1, టెక్నీషియన్‌ లీడ్‌(యుఎటి) 12, ఇన్నోవేషన్‌ స్పెషలిస్ట్‌ 5
 వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
 అర్హత- అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ + కనీసం ఆరేళ్లు
 డేటా సైంటిస్ట్‌ 3, సోర్సింగ్‌ అనలిస్ట్‌ 1
 వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 
అర్హత: పీజీ(స్టాటిస్టిక్స్‌)/ ఎంబిఏ(మార్కెటింగ్‌/సేల్స్‌/ ఆపరేషన్స్‌) ఉత్తీర్ణతతోపాటు కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
 యుఎక్స్‌ డిజైనర్‌(ఎస్‌ఎం & డబ్ల్యు) 1,
 డబ్ల్యుఎఎస్‌ అడ్మినిస్ట్రేటర్‌ (ఐటిఎఫ్‌ఒ) 1
 వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ + కనీసం నాలుగేళ్లు
 
ఎంపిక: ఈ కాంట్రాక్ట్‌ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
 
దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.100)
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 22
 
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: అక్టోబరు 26
 కాల్‌ లెటర్స్‌ డౌన్‌లోడింగ్‌: నవంబరు 15 నుంచి
 ఆన్‌లైన్‌ టెస్ట్‌: నవంబరు 25న
 
చిరునామా: The General Manager, SBI, Corporate Centre, Central Recruitment & Promotion Department, Atlanta Building, 3rd Floor, Plot No. 209, VBR, Block. No. III, Nariman Point, Mumbai- 400021
 
 www.sbi.co.in/careers/ongoing- recruitment.html
 

Saturday, 1 October 2016

రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ధ్యాన శిక్షణకు విచ్చేసిన అందరికి
ధన్యవాదములతో