Friday, 16 December 2016

  • అయితే సెక్రటరీ జైలుకు వెళ్లాల్సిందే!
  • సభ్యులకు జరిమానా, కటకటాల ముప్పు
  • ఆషామాషీ నిర్వహణ ఇక కుదరదు
  • తేడా వస్తే బాధ్యత వెల్ఫేర్‌ కమిటీదే
  • పటిష్ఠత లేకుంటే అపార్ట్‌మెంట్‌ సీజ్‌
  • తగ్గిపోతున్న అపార్ట్‌మెంట్ల జీవితకాలం
  • చంద్రలోక్‌ ఘటనతో అప్రమత్తం
  • నిపుణులతో జీహెచ్‌ఎంసీ కమిటీ
 
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: అపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ అంటే ఎంతో గౌరవం... వెల్ఫేర్‌ సొసైటీ సభ్యుడైతే కనీసం మాట చెల్లే మర్యాద... అందుకే అపార్ట్‌మెంటులోని గృహస్థులు పైకి వద్దు వద్దంటూనే మెయింటెనెన్స్‌ పదవుల్లో చేరిపోతారు. బాధ్యతలు మాత్రం తీసుకోరు. కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినపుడు ఉలిపిరికట్టె లాంటి సభ్యుడొకరు అడ్డం పడతాడు. ఇగోల యుద్ధంలో ఆ నిర్ణయం మూలన పడుతుంది. మిగతా వాళ్లంతా మాకెందుకులే అని మౌనంగా ఉండిపోతారు. దాంతో అపార్ట్‌మెంట్‌ నిర్వహణ ఘోరంగా తయారవుతుంది. చివరికి అది ఏకంగా అపార్ట్‌మెంట్‌ పటిష్ఠతనే దెబ్బ తీస్తుంది. ఇలాంటి భవనాలు కాలం చెల్లక ముందే కూలిపోతే బాధ్యత ఎవరిది? ఇప్పటిదాకా ఎవరిదీ కాదు. ఇక నుంచి ‘వెల్ఫేర్‌ సొసైటీ’దే బాధ్యతని జీహెచ్‌ఎంసీ తేల్చి చెబుతోంది. భవనం వెల్ఫేర్‌ను మరచి అలంకార ప్రాయంగా కమిటీ పోస్టుల్లో కూర్చుంటే జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని హెచ్చరిస్తోంది.
 
మూడు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ ఎలివేషన్‌ ఊడిపడి రోడ్డుపై వెళుతున్న పౌరుడొకరు మృతి చెందారు.రాజధానిలో మెయింటెనెన్స్‌ సరిగా లేక వేల భవనాలు ప్రమాదకరంగా తయారయ్యాయని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. చంద్రలోక్‌ ఘటనతో నగర పాలక సంస్థ అప్రమత్తమైంది. ఏళ్ల తరబడి నివాసముంటూ కనీస నిర్వహణ చేపట్టని సొసైటీ వెల్ఫేర్‌ కమిటీలపై చర్యలకు జీహెచ్‌ఎంసీ ఉపక్రమిస్తోంది. నిర్మాణదారుడి నుంచి భవనాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత అపార్ట్‌మెంట్‌ యజమానులు పరస్పర అంగీకారంతో ఏర్పాటు చేసుకునే వెల్ఫేర్‌ సొసైటీలు విధిగా ఇతర సంక్షేమ అంశాలతో పాటు భవన పటిష్ఠత పైనా దృష్టి పెట్టాలి. పలు సొసైటీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు సర్వేలో తేలింది. వాణిజ్య నివాస గృహ సముదాయాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అందుకే నిర్వహణ లోపాలకు వెల్ఫేర్‌ కమిటీ సభ్యులనే బాధ్యులను చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి త్వరలో జీహెచ్‌ఎంసీ ఒక నివేదికను పంపనుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే సొసైటీల సభ్యులపై జరిమానాలు, లోపాల తీవ్రతను బట్టి కేసులు పెడతారు. ప్రమాదకర అపార్టుమెంట్లను సీజ్‌ చేస్తారు.
 
శిథిలావస్థకు చేరిన భవంతులకు అవసరమైన మరమ్మతులు చేయించని సొసైటీలపై ఒత్తిడి పెంచడం ద్వారా అందులో నివసించే ప్రజల సంరక్షణ చేపట్టాలనే లక్ష్యంతో కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు గ్రేటర్‌ ఉన్నతాధికారి తెలిపారు. అపార్ట్‌మెంట్‌ మెరుగైన నిర్వహణ కోసం ఎన్నేళ్లకోసారి రంగులు వేయాలి? లీకేజీలు ఏర్పడితే మరమ్మతులతోపాటు శాశ్వత పరిష్కారంగా ఏం చేయాలి? భవనం పటిష్ఠత తగ్గకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న దానిపై జేఎన్‌టీయు, ఓయూ ఇంజనీరింగ్‌ నిపుణుల బృందం విదివిధానాలు జీహెచ్‌ఎంసీకి అందించింది. వాటి ఆధారంగా సర్కిల్‌ స్థాయిలో ఆర్‌డబ్ల్యుఏలకు అవగాహన కల్పిస్తారు. త్వరలో ఇంజనీరింగ్‌ కమిటీ నగరంలోని రెండు, మూడు దశాబ్దాల కిందటి అపార్ట్‌మెంట్‌లను తనిఖీ చేసి పటిష్ఠతను నిర్ధారిస్తుంది. నివేదిక ఆధారంగా భవనాల నిర్వహణ, మరమ్మతు పనులు చేపట్టాలని వెల్ఫేర్‌ సొసైటీకి జీహెచ్‌ఎంసీ సూచిస్తుంది.
 
స్పందించకుంటే నోటీసు జారీ చేస్తారు. గడువు ముగియగానే భవనాన్ని సీజ్‌ చేస్తారు. పూర్తి బాధ్యత అపార్ట్‌మెంట్‌ వెల్ఫేర్‌ సొసైటీదే. గ్రేటర్‌లో 2 లక్షలకుపైగా అపార్ట్‌మెంట్‌లు ఉంటాయి. ప్రతి అపార్ట్‌మెంట్‌లో వెల్ఫేర్‌ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలి. అధ్యక్షుడు, కార్యదర్శితో పాటు ఇతర కార్యవర్గాన్ని నమోదు చేసుకోవాలి. భవనం మెయింటెనెన్స్‌ ఈ కమిటీ బాధ్యత. చాలా అపార్ట్‌మెంట్‌లకు కమిటీలు లేవు. ఉన్నవీ సరిగా పనిచేయవు. కనీస బాధ్యతలు కూడా అవి తీసుకోవడం లేదు. లీకేజీల మరమ్మతు వెంటనే చేయకపోవడంతో సమస్య తీవ్రంగా మారుతోంది. రంగులు వేయక పోవడంతో శ్లాబ్‌ల పెచ్చులూడి కింద పడుతుంటాయి. ఇవన్నీ అపార్ట్‌మెంట్‌ జీవితకాలంపై ప్రభావం చూపుతున్నాయి. వాస్తవ జీవితకాలం కంటే ముందే శిథిలావస్థకు చేరుతున్నాయి. 44 ఏళ్ల క్రితం నిర్మించిన సికింద్రాబాద్‌లోని చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ ఎలివేషన్‌ నిర్వహణ లోపం కారణంగానే కుప్పకూలింది. భవనం కూడా శిథిలావస్థకు చేరింది. ఏ క్షణాన్నయినా కూలిపోయే ప్రమాదముందంటూ ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు  http://www.andhrajyothy.com/artical?SID=346068

Thursday, 24 November 2016

పెద్ద నోట్ల రద్దు వల్ల భవిష్యత్‌లో నగదు రహిత లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. సామాన్యుడి నుంచి మొదలుకొని  అందరూ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా  చెల్లింపులు చేస్తారు.కనుక బ్యాంకు లావాదేవీలు చేసేటప్పుడు, ఏటీఎమ్‌లలో, ఇతర ప్రదేశాలలో కార్డ్స్ ఉపయోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.నగదు రహిత లావాదేవీలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలని సాంకేతిక నిపుణులు  సూచిస్తున్నారు. 

  • మీ బ్యాంకు ఖాతాను అప్‌గ్రేడ్‌ చేసుకోండి! అందుకు ఫలానా లింక్‌ క్లిక్‌చేయమంటూ ఎస్‌ఎమ్‌ఎస్‌, మెయిల్‌ ద్వారా మనకు సందేశం పంపిస్తారు. ఆ లింక్‌ క్లిక్‌ చేశామంటే, అంతే! మన బ్యాంకు సంబంధించిన వివరాలన్నీ వారికి చేరినట్లే. ఈ మధ్యకాలంలో ఇలాంటి హ్యాకింగ్స్‌ ఎక్కువ జరుగుతున్నాయి. వీటిని ఫిషింగ్‌ అటాక్‌ అంటారు. బ్యాంకులు ఖాతాకు సంబంధించిన స్టేట్‌మెంట్‌తప్ప మరేవీ పంపవన్న సంగతి గుర్తించాలి. ఆ మెసేజ్‌ల పట్ల అప్పమత్తంగా ఉండాలి.
  • మొబైల్‌లో పైరసీ, పొర్నోగ్రఫీ చిత్రాలు డౌన్‌లోడ్‌ చేయడం మంచిదికాదు. వాటిద్వారా హ్యాకర్లు ప్రవేశించి మీ సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది.
  • ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసేప్పుడు అక్కడ హెచ్‌టీటీపీని మాత్రమే సెలక్ట్‌చేయాలి. ఒకవేళ హెచ్‌టీటీపీఎస్‌ ఉంటే కనుక, అది నకిలీఅని అర్థం.
  • ఇంటర్‌నెట్‌ సెంటర్ల ద్వారా నెట్‌ బ్యాంకింగ్‌ వినియోగించడం మంచిది కాదు.
  • కొన్ని ఏటీఎం సెంటర్లలో స్కిమ్మర్స్‌ అనే చిన్న డివైజ్‌ అమర్చి, కార్డు వివరాలన్నింటినీ తస్కరిస్తున్న హ్యాకర్లు ఉన్నారు. చిన్న గల్లీలు, జనావాసం తక్కువగా ఉండే ప్రాంతాల్లోని ఏటీఎంలను వాడేప్పుడు జాగ్రత్త వహించాలి.
  • ఓటీపీ లేకపోయినా హ్యాకర్లు మన ఖాతాను ఖాళీచేసే అవకాశం ఉంటుందని గుర్తించాలి.
  • గతేడాది 32లక్షల డెబిట్‌కార్డులను చైనాకు చెందిన ఓ ముఠా హ్యాకింగ్‌ చేసింది. దాంతో బ్యాంకులన్నీ కొత్తకార్డులు జారీచేశాయి.
  • ప్రతిరోజూ లేక కనీసం రెండు రోజుల కొకసారి అకౌంట్‌ చెక్‌ చేసుకోవడం మంచిది.
  • ఒకసారి డబ్బు మన ఖాతాదాటిందంటే, పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప మరేమీ చేయలేం.
  • ఇతర దేశాల్లో, రాష్ట్రా‌ల్లో నుంచి హ్యాకింగ్‌ చేస్తున్నారు. వారిని పట్టుకోవడం చాలా కష్టతరం కూడా. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం అప్రమత్తంగా ఉండటమే చాలా అవసరం.

Two Thousand Rupee


1 రూపాయి కాయిన్స్ - రూ.4,178 కోట్లు 
2 రూపాయి కాయిన్స్ - రూ.5,926 కోట్లు
5 రూపాయి కాయిన్స్ - రూ.7,045 కోట్లు 
10 రూపాయి కాయిన్స్ - రూ.3,703 కోట్లు
కరెన్సీ నోట్లు 
2 రూపాయల నోట్లు - రూ.853 కోట్లు 
5 రూపాయల నోట్లు - రూ.3,680 కోట్లు
10 రూపాయల నోట్లు - రూ.32,015 కోట్లు
20 రూపాయల నోట్లు - రూ.9,847 కోట్లు
50 రూపాయల నోట్లు - రూ.19,450 కోట్లు
100 రూపాయల నోట్లు - రూ.1,57,783 కోట్లు
500 రూపాయల నోట్లు - రూ.7,85,375 కోట్లు
1000 రూపాయల నోట్లు - రూ.6,32,568 కోట్లు
ఇవి కాక చిన్న చిన్న కాయిన్స్ రూ.700 కోట్లు, పాత మరియు చిన్న నోట్లు రూ.309 కోట్ల రూపాయల మేర ఉన్నది.
అంటే మొత్తంగా రూ.21,552 కోట్ల రూపాయలు కాయిన్స్ రూపంలో ఉండగా, రూ.16,41,880 కోట్ల రూపాయలు నోట్ల రూపంలో దేశం లో చెలామణి లో ఉంది.
copied from other file
నెల్లూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో మరియు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నామని, ఆ ఫుటేజ్ లను ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండడం జరుగున్నదని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేసారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే కేసులు బుక్ చేసి ఈ-చలానాలు సంబంధిత వాహనదారునికి పంపుతామని తెలిపారు. చలానాలు చెల్లించకుంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. నో పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేసినా, వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగా లేకున్నా, రాంగ్ రూట్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ లేకుండా వాహనాన్ని డ్రైవ్ చేయడం, బైక్స్ లో ట్రిపుల్ రైడింగ్ మొదలగువన్నీ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతున్నదని కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తమ అధికారిక ఫేస్ బుక్ పేజీ ద్వారా కూడా స్పష్టం చేసారు.

Sunday, 20 November 2016

పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటివరకూ 5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయని ప్రధాని తెలియజేశారు, పెద్ద నోట్ల రద్దుతో పది రోజుల్లోనే పాత పన్నులన్నింటినీ జనం కడుతున్నారు. మునిసిపాలిటీలకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది.

Saturday, 29 October 2016

దీపావళీ ఐదు రోజుల పండుగ !!
దీపావళీ పండుగ శుభాకాంక్షలు !!
1 - ధన్వంతరీ త్రయెాదశి - వాడుకలో ధన త్రయెాదశి
అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం
కానీ ఆరోజు "ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు
శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన "ధన్వంతరీ భగవాన్"
జయంతి ! పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో
అమృతభాండముతో అవతరించాడు !!
2 - నరక చతుర్దశి - నరక యాతనల నుండి రక్షించమని
యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి ! నరకుడు చనిపోయిన రోజు కూడా
ప్రాక్జ్యోతీషపురం(నేటి అస్సాము) ను పాలించే ' నరకుడు'
నర రూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుతశక్తులను
సంపాదించి దేవతలను కూడా ఓడించాడు ! వాడు ప్రతీ
అమావాస్య- పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను బలి
ఇచ్చేవాడు ! కాముకత్వంతో అనభవించేవాడు ! నరకుని
చెరసాలలో వేలాది అందమైన మహిళలు బందీలుగా వుండేవారు ! ఆది వరాహ మూర్తికి - భూదేవికి కలిగిన
సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జనించాడు !
శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ(భూదేవీ అవతారం)తో
కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని
శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు !
నరకుని పీడ విరగడైంది కావున ఇది 'నరక చతుర్దశి' !!
3 - దీపావళీ - రావణ సంహారం తర్వాత సీతారాములు
అయెాధ్యకు వచ్చిన శుభ సంధర్భఁగా దీపావళి జరుపు
కోవాటం , నరకుని బాధలనుండి విముక్తి లభించిన ఆనందం
లో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం !!
దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞానస్వరూపం
అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము !!
వ్వాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు !!
4 - బలి పాఢ్యమి - వామనావతారంలో శ్రీమన్నారాయణుడు
బలి చక్రవర్తిని 'మూడు అడుగుల' నేలను దానమడిగాడు !
వామన వటువు కు దానమిచ్చాడు బలి, "ఇంతింతై వటుడింతై
నభోరాశిపై నల్లంతై" అన్నట్లుగా ఒకపాదంతో భూమిని, ఇంకోపాదంతో
 ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు !
 సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి 
ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని 
ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం !!
5 - యమద్వితీయ - సూర్యభగవానునికి యముడు - శని
దేవుడు ఇద్దరు పుత్రులు ! యమున అనే ఒక పుత్రిక కలదు !
యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తన
పని (జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశం తో 
ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగినన శిక్షలు 
విధించే పని)లో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం
లేదు యముడు !! చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా !!
 అని కార్తీక శుద్ఘ విదియ రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా 
కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు !! చెల్లెలైన యముున అన్నయ్యను ఒక
వరం అడిగింది ! ఎవరైతే ఈరోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుకలిచ్చి
 వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది !!
ఈ యమునమ్మనే యమునా నది ! కృష్ణ భక్తురాలు !
"భగినీ హస్త భోజనం" పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ
ఇప్పటికీ జరుపుకుంటారు !! ఇదీ ఐదు పండుగల కథ !!
విశ్వశాంతి వర్ధిల్లును గాక ! శుభమ్ భూయాత్ !

     ధన్యవాధములు 
    శ్రీకంఠం రమణయ్య

Tuesday, 18 October 2016

పట్టభద్రుల  శాసనమండలి ఎన్నికల్లో ఓటేయాలంటే ప్రభుత్వం ceoandhra.nic.inఆన్‌లైన్‌లో పొందుపరచిన వెబ్‌సైట్‌లో  (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓటరుగా) నమోదు చేసుకోండి
  • ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
  • నవంబరు  2,2013వ తేదీ నాటికి పట్టభద్రుడై ఉండాలి
  • (విద్యార్హతను పరీక్షా ఫలితాలు ప్రకటించిననాటి నుంచే లెక్కిస్తారు)శాసనసభ నియోజకవర్గంలో ఓటరుగా ఉంటే ఆ వివరాలు పొందుపరిస్తే మంచిది
  • దరఖాస్తుతో ఫోటో తప్పనిసరిగా Degree జెరాక్స్ కాపి జతపరచాలి
  • డాక్టర్లు, ఆడిటర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వారి వారి రిజిష్టర్డ్  అర్హతను ధ్రువీకరించుకోవచ్చు.
  • ఒకే కుటుంబంలో పట్టభద్రులు ఉంటే అందరి దరఖాస్తులు కుటుంబ వ్యక్తి తీసుకెళ్లి సమర్పించి, రసీదు పొందవచ్చు, మనకు నమోదు అధికారి నెల్లూరు  R D O గారు.
                                                                     ధన్యవాధములు 
                                                                                                                                                                                                                                     శ్రీకంఠం రమణయ్య
                                                                                                                                                                                                                                              కార్యదర్శి
                                                                                                                                                                                                             రామముర్తినగర్ ఓనర్స్ అసోసియేషన్,నెల్లూరు

Friday, 14 October 2016

పట్టభద్రుల  శాసనమండలి ఎన్నికల్లో ఓటేయాలంటే ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పొందుపరచిన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోండి. (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓటరుగా)
  • ప్రతి ఒక పట్టభద్రుడు ఓటు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి
  • నవంబరు 2013 ఒకటవ తేదీ నాటికి పట్టభద్రుడై ఉండాలి
  • విద్యార్హతను పరీక్షా ఫలితాలు ప్రకటించిననాటి నుంచే లెక్కిస్తారు
  • శాసనసభ నియోజకవర్గంలో ఓటరుగా ఉంటే ఆ వివరాలు పొందుపరిస్తే మంచిది
  • దరఖాస్తుతో ఫోటో తప్పనిసరిగా జతపరచాలి
  • ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్నవారు తమ సంస్థ అధికారి ద్వారా ధ్రువీకరణపత్రం జతపరచి సంస్థలోని వారందరి దరఖాస్తులు ఒకే వ్యక్తి ద్వారా పంపవచ్చును. వీరు డిగ్రీ సర్టిఫికేట్లు జిరాక్స్‌ కాపీలు జతపరచనక్కర్లేదు. ఆ అధికారికి గెజిటెడ్‌ హోదా ఉండాలి
  • డాక్టర్లు, ఆడిటర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, రిజిస్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ప్రాక్టీస్‌, రూల్స్‌ ఆఫ్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌, రిజిస్టర్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ తమ అర్హతను ధ్రువీకరించుకోవచ్చు.
  • ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులు డిగ్రీ సర్టిఫికేట్‌ జిరాక్స్‌కాపీని  గెజిటెడ్‌ అధికారి చేత ధ్రువీకరించి దరఖాస్తుకు జతపరచాలి. ఆ దరఖాస్తును వ్యక్తిగతంగా ఓటరు నమోదు అధికారికి అందజేసి రసీదు పొందాలి. దరఖాస్తు స్వీకరించే అధికారికి ఒరిజినల్‌ సర్టిఫికేట్స్‌ చూపాల్సి ఉంటుంది.
  • ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేవారు సీఈవో ఆంధ్రా.ఎన్‌ఐసీ.ఇన్‌ (నాల్గవ రకం ఏబీసీడీ) వెబ్‌సైట్‌ నందు ఇ-రిజిసే్ట్రషన్‌ కౌన్సిల్‌ ఠి ఫోరం18లోనికి వెళ్లి నమోదు చేయాలి. ఫోటో ధ్రువీకరించి సర్టిఫికేట్స్‌ స్కాన్‌చేసి అప్‌లోడ్‌ చేయాలి
  • దరఖాస్తులు మొత్తంగా ఒకటికంటే ఎక్కువగా ఒకే వ్యక్తి తీసుకెళ్లి సమర్పించే వీలులేదు
  • ఒకే కుటుంబంలో పట్టభద్రులు ఉంటే అందరివి ఒకే వ్యక్తి తీసుకెళ్లి సమర్పించి రసీదు పొందవచ్చు, మనకు నెల్లూరుమున్సిపల్‌ కార్పోరేషన్ కమిషనర్ (నమోదు అధికారి)
  • అసోసియేషన్ ద్వారా ఓటరు దరఖాస్తులను సేకరించి అధికారులకు సమర్పించే వీలులేదు.

Thursday, 13 October 2016

స్టాఫ్‌ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి)- వివిధ విభాగాల్లో ఉన్న 5134 పోస్టుల భర్తీకోసం భారీ నోటిఫికేషన విడుదల చేసింది. పోస్టల్‌ అసిస్టెంట్స్‌/ సోర్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు 3281, ఎల్‌డిసి పోస్టులు 1321, డిఇఒ పోస్టులు 506 కాగా కోర్టు క్లర్క్‌ 26 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. 2017 జనవరి 1 నాటికి అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ దరఖాస్తుకు అర్హులు.
 
ఫీజు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు/ మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కంప్యూటర్‌ బేస్డ్‌ రిటెన ఎగ్జామినేషన, డిస్ర్కిప్టివ్‌ పేపర్‌, టైపింగ్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. నవంబరు 7 లోపు అభ్యర్థులు ఆనలైనలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 5 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌, ఏప్రిల్‌ 9న డిస్ర్కిప్టివ్‌ పేపర్‌ ఎగ్జామ్‌ జరుగుతాయి. పూర్తి వివరాల కోసం www.ssconline.nic.in

Thursday, 6 October 2016

ఉద్యోగ నోటిఫికేషన్స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ)- రెగ్యులర్‌/ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకోసం ప్రకటన విడుదల చేసింది.
 
మొత్తం ఖాళీలు: 412
 రెగ్యులర్‌ పోస్టులు
 అసిస్టెంట్‌ మేనేజర్‌(సిస్టమ్‌)
 ఖాళీలు: 180(జనరల్‌ అభ్యర్థులకు 92 పోస్టులను కేటాయించారు)
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
 
అర్హత: (బిఇ/బిటెక్‌/ ఎమ్మెస్సీ)(కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ & టెలికమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌)/ ఎంసిఏ ఉత్తీర్ణులై ఉండాలి.
 
అనుభవం: కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
 
డెవలపర్‌ ఖాళీలు: 50
 విభాగాలు: ఎస్‌పి- 1, ఎల్‌ఎంఎస్‌, కోర్‌ బ్యాంకింగ్‌ ఎస్‌పి- 2, ఐటి-టిఎస్‌ఎస్‌, మొబైల్‌, ఐఎన్‌బి, ఎటిఎం, ఐటిఎఫ్‌ఒ, ఒపిఎస్‌్క్ష టిఎస్‌, ఒపిఎస్‌్క్ష పిఎస్‌, ఎఫ్‌ఐజిఎస్‌, కంప్లైంట్స్‌, ఎస్‌పి -3, ఎస్‌ఎం & డబ్ల్యు
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
 అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
 అనుభవం: ఐటి బిజినెస్‌/ ఇండస్ట్రీ ఇన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అప్లికేషన్స్‌లో అయిదేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ సంబంధిత స్కిల్స్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
 టెస్ట్‌ లీడ్‌ ఖాళీలు: 2
 వయసు: 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
 
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉండాలి.
 
అనుభవం: ఐటి సెక్టార్‌లో టెస్టింగ్‌కు సంబంధించి ఆరేళ్ల అనుభవం ఉండాలి. టీమ్‌ లీడర్‌గా రెండేళ్లు పనిచేసి ఉండాలి
 
టెస్టర్‌ ఖాళీలు: 12
 వయసు: 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
 అర్హత- అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి టెస్టింగ్‌లోనాలుగేళ్లఅనుభవం ఉండాలి.
డెవలపర్‌(టెస్ట్‌ లీడ్‌ & టెస్టర్‌)
 
ఖాళీలు: 64(జనరల్‌ అభ్యర్థులకు 34 పోస్టులు కేటాయించారు)
 మేనేజర్‌(స్టాటిస్టీషియన్‌)
 ఖాళీలు: 7(జనరల్‌ అభ్యర్థులకు 5 పోస్టులు కేటాయించారు)
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత- అనుభవం: 60 శాతం మార్కులతో పీజీ(స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
 అసిస్టెంట్‌ మేనేజర్‌ (స్టాటిస్టీషియన్‌)
 ఖాళీలు: 20(జనరల్‌ అభ్యర్థులకు 11 పోస్టులు కేటాయించారు)
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత- అనుభవం: 60 శాతం మార్కులతో డిగ్రీ (స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి.
 పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్‌ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
 కాంట్రాక్ట్‌ పోస్టులు
 టెక్నాలజీ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌
 ఖాళీలు: 4(జనరల్‌ అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు)
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 28 నుంచి 40 ఏళ్లమధ్య ఉండాలి.
 అర్హత - అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐటి ఇండస్ట్రీలో ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. దీనిలో అయిదేళ్లు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌కు సంబంధించి పనిచేసి ఉండాలి.
 అడ్మిన్‌ సపోర్ట్‌ ఆఫీసర్‌(ఎంఎబి) ఖాళీలు: 1
 వయసు: సెప్టెంబరు 1 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
 
అర్హత- అనుభవం: ఎంబిఏ(మార్కెటింగ్‌/ ఆపరేషన్స్‌) పూర్తిచేసి ఉండాలి. ఇంజనీరింగ్‌ డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఐటి ఇండస్ట్రీలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి
 అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్‌(ఐఎన్‌బి, మొబైల్‌) ఖాళీలు: 2
 వయసు: 28 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఐటి ఇండస్ట్రీలో 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
 
బిజినెస్‌ ఆర్కిటెక్ట్‌(ఇ ్క్ష టిఏ) 1, డేటా వేర్‌హౌస్‌ ఆర్కిటెక్ట్‌ (ఐడిఎస్‌పిఎం)1, ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్ట్‌(ఇ్క్షటిఏ) 2, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆర్కిటెక్ట్‌(డిసి్క్ష బిసిఎం, డిఆర్‌సి, ఐటిఎఫ్‌ఒ, పిఇ-1, పిఇ-2, టెక్‌ ఒపి, ఎన్‌డబ్ల్యు  & కమ్యూనికేషన్స్‌) 6
 
వయసు: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత- అనుభవం: బిఇ/బిటెక్‌(సిఎస్‌/ఐటి/ఇసిఇ)/ ఎంసిఏ ఉత్తీర్ణతతోపాటు ఐటి ఇండస్ట్రీలో 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
 పోర్టల్‌ ఆర్కిటెక్ట్‌(ఎస్‌ఎం్క్ష డబ్ల్యు) ఖాళీలు: 1
 వయసు: 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత- అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ+ఐటి ఇండస్ట్రీలో ఆరేళ్ల అనుభవం ఉండాలి)
టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌(ఐఎన్‌బి, ఇ్క్ష టిఏ, ఒపిఎస్‌ & పిఎస్‌)
 ఖాళీలు: 5
 వయసు: 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత- అనుభవం: ఐటి ఇండస్ట్రీలో పదేళ్ల అనుభవం ఉండాలి
 
పోస్టులు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీర్‌ 9, సివిల్‌ ఇంజనీర్‌ 1, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ 1, టెక్నికల్‌ ఇంజనీర్‌ 1, నెట్‌వర్క్‌ ఇంజనీర్‌ 2
 వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీతోపాటు ఐటి ఇండస్ట్రీలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి
 పోస్టులు: కంప్లైంట్‌/ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ ఆఫీసర్‌ 2, ఐటి రిస్క్‌ మేనేజర్‌ 2, ఐటి సెక్యూరిటి ఎక్స్‌పర్ట్‌ 2
 వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 ప్రాజెక్ట్‌ మేనేజర్‌
 ఖాళీలు: 29(జనరల్‌ అభ్యర్థులకు 16 పోస్టులు కేటాయించారు)
 బిజినెస్‌ అనలిస్ట్‌
 ఖాళీలు: 18(జనరల్‌ అభ్యర్థులకు 11 పోస్టులు కేటాయించారు)
 
డెవలపర్‌ (హెచ్‌ఆర్‌ఎంఎస్‌, ఎటిఎం, ఐఎన్‌బి, ఇపే, ఐటిఎఫ్‌ఒ, ఐటిటిఎస్‌ఎస్‌, ఎల్‌ఎంఎస్‌, మొబైల్‌, ఒపిఎస్‌్క్ష పిఎస్‌, ఒపిఎస్‌్క్ష టిఎస్‌, ఎస్‌పి - 3, ఎస్‌పి - 1)
 
ఖాళీలు: 22 (జనరల్‌ అభ్యర్థులకు 12 పోస్టులు కేటాయించారు)
 
టెస్టర్‌(ఐఎన్‌బి) 5, టెస్ట్‌ లీడ్‌(యుఎటి) 1, టెక్నీషియన్‌ లీడ్‌(యుఎటి) 12, ఇన్నోవేషన్‌ స్పెషలిస్ట్‌ 5
 వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
 అర్హత- అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ + కనీసం ఆరేళ్లు
 డేటా సైంటిస్ట్‌ 3, సోర్సింగ్‌ అనలిస్ట్‌ 1
 వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 
అర్హత: పీజీ(స్టాటిస్టిక్స్‌)/ ఎంబిఏ(మార్కెటింగ్‌/సేల్స్‌/ ఆపరేషన్స్‌) ఉత్తీర్ణతతోపాటు కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
 యుఎక్స్‌ డిజైనర్‌(ఎస్‌ఎం & డబ్ల్యు) 1,
 డబ్ల్యుఎఎస్‌ అడ్మినిస్ట్రేటర్‌ (ఐటిఎఫ్‌ఒ) 1
 వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
 అర్హత అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ + కనీసం నాలుగేళ్లు
 
ఎంపిక: ఈ కాంట్రాక్ట్‌ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
 
దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.100)
 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 22
 
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: అక్టోబరు 26
 కాల్‌ లెటర్స్‌ డౌన్‌లోడింగ్‌: నవంబరు 15 నుంచి
 ఆన్‌లైన్‌ టెస్ట్‌: నవంబరు 25న
 
చిరునామా: The General Manager, SBI, Corporate Centre, Central Recruitment & Promotion Department, Atlanta Building, 3rd Floor, Plot No. 209, VBR, Block. No. III, Nariman Point, Mumbai- 400021
 
 www.sbi.co.in/careers/ongoing- recruitment.html
 

Saturday, 1 October 2016

రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ధ్యాన శిక్షణకు విచ్చేసిన అందరికి
ధన్యవాదములతో

Sunday, 25 September 2016

రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే బ్రాహ్మణులకు ఐదు కోట్ల రూపాయల వరకూ రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని, ఇందుకు బ్యాంకర్లు కూడా సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. బ్రాహ్మణులకు అభివృద్దికి బ్యాంక్‌లు సహకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ నుంచి 3103 మంది పేదలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 360 మందికి రుణసౌకర్యం కల్పించడంలో బ్యాంకర్లు సహకరించాలని కృష్ణారావు కోరారు.
ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్‌ ఎంపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు దీనికి అర్హులు. 7 జూలై 1997- 20 డిసెంబర్‌ 2000 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ నెల 29 లోపు అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. వెబ్‌సైట్ www.airmenselection.gov.in.

Saturday, 24 September 2016

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏపిఎస్‌ఎల్‌పిఆర్‌బి)- ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్‌, అసిస్టెంట్‌ మాట్రన్‌ ఉద్యోగాల భర్తీకోసం భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పలు విభాగాల వారీగా పురుషులకు, మహిళలకు కేటాయించిన ఖాళీలను ప్రకటించారు. మొత్తమ్మీద 707 పోస్టులు ఉన్నాయి.
 
విభాగాలు - ఖాళీలు
 
స్టయిపెండరీ క్యాడెట్‌ ట్రైనీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) విభాగంలో 355 పోస్టులు, స్టయిపెండరీ క్యాడెట్‌ ట్రైనీ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎఆర్‌) విభా గంలో 113 పోస్టులు ఉన్నాయి. వీటికి పురుషులు, మహి ళలు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుషులకు మాత్ర మే స్టయిపెండరీ క్యాడెట్‌ ట్రైనీ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎఆర్‌ సిపిఎల్‌) విభాగంలో 9 ఖాళీలు, స్టయిపెండరీ క్యాడెట్‌ ట్రైనీ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎపిఎస్పీ) విభాగంలో 209 ఖాళీలు ఉన్నాయి. ప్రిజన్స్‌ ్క్ష కరెక్షనల్‌ సర్వీసెస్‌ విభాగంలో డిప్యూటీ జైలర్‌ పోస్టుకు సంబంధించి పురుషులకు 16, అసిస్టెంట్‌ మ్యాట్రన్‌గా మహిళలకు 5 పోస్టులు ఉన్నాయి.
 

Monday, 19 September 2016

 చికెన్ గున్యా  లక్షణాలు మీలో కనిపిస్తే అధైర్యపడకుండా డాక్టర్లను సంప్రదించండి.
 
1. ఈ వైరస్ ప్రభావాన్ని నాలుగు నుంచి ఏడు రోజుల్లో గుర్తించవచ్చు.
 
2. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి 102 నుంచి 104 ఫారిన్ హీట్ ఉష్ణోగ్రతతో ఒళ్లు కాలిపోతుంది.
 
3. మోకాళ్ల నొప్పులు, వెన్నుపూస నొప్పులు అధికంగా ఉంటాయి.
 
4. రోజురోజుకూ వ్యాధినిరోధక శక్తి నశించి, నీరసంతో కుంగిపోతారు.
 
5. చిన్నారులు, వృద్ధులలో చికెన్ గున్యా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
 
6. ఈ లక్షణాలు కనిపిస్తే వ్యాధిగ్రస్తులకు వెంటనే వైద్య పరీక్షలు చేయిచండి.

Sunday, 18 September 2016

నెలాఖరులోగా వివిధ గ్రూపులకు చెందిన 4009 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ పి.ఉదయభాస్కర్‌ తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో విలేకరులతో మాట్లాడారు. వీటిలో 748 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), 750 గ్రూప్‌-2 పోస్టులు, 1000 గ్రూప్‌-3 పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. ఏఈఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ అయిందని తెలిపారు. ప్రతి సంవత్సరం క్యాలెండర్‌ విధానం ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు అవసరమైన ప్రక్రియను రూపొందిస్తున్నామన్నారు. క్యాలెండర్‌ విధానం అమలు చేయాలంటే భర్తీ ప్రక్రియను మొదలుపెట్టి ఆరు నెలలలోపు పూర్తి చేయగలిగితేనే తిరిగి నోటిఫికేషన్‌ విడుదలకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇవిగాక అదనంగా బ్యాక్‌ లాగ్‌ పోస్టుల ఖాళీలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీపీఎ్‌ససీ కార్యాలయాన్ని అమరావతిలో నిర్మించేందుకు నాలుగెకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామన్నారు. గుంటూరు లేదా విజయవాడలో తాత్కాలికంగా అద్దె భవనంలో కార్యాలయం ఏర్పాటుకు సమాయత్తమవుతున్నామని తెలిపారు.
http://legendri.in/55-thousands-of-posts-in-postal-department/

Wednesday, 14 September 2016

తేదీ 08/09/2016 నాడు

మన రామముర్తినగర్ లో 1 వ మెయిన్,2 వ మెయిన్,3 వ మెయిన్ రోడ్డు నందు దక్షిణ భాగము
 మరియు 2 - 3 మెయిన్ రోడ్ల మధ్య 2 వ క్రాస్ రోడ్డు నందు, 1 వ మెయిన్ రోడ్డు ఉత్తర భాగము
 4 వ మెయిన్ రోడ్డు కు ఓపన్ CC డ్రైన్ వర్క్ ప్రారంభోత్సవమునకు నెల్లూరు నగర మేయర్,
సిటి TDP ఇంచార్జ్, మాజీ మునిసిపల్ చైర్ఉమన్ మరియు రామముర్తినగర్ సభ్యులు పాల్గోనినారు
అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తూ తెలుగులో ఉత్తర్వును జారీ చేసింది. భాషాభివృద్ధి కమిటీ సభ్యులుగా మండలి బుద్దప్రసాద్, పరకాల ప్రభాకర్, నాగులపల్లి శ్రీకాంత్, జీవీ రామకృష్ణారావు, విజయ‌భాస్కర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి శిలాఫలకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పేర్లు తెలుగులోనే ఉండాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండాలని యజమానులను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు భాషా అభిమానులు, సాహితీ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tuesday, 13 September 2016

మహ్మదీయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు వారిమరియు 
కుటుంబసభ్యులకు 
బక్రీద్ పండుగ 
శుభాకాంక్షలు ⭐️🌙🕋

Friday, 9 September 2016

‘చేతిరాత’ పాస్‌పోర్టు మార్చుకోవాల్సిందే! 
ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సర్క్యులర్‌ 
హైదరాబాద్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): చేతిరాతతో ఉన్న పాస్‌పోర్టులను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్(మెషిన్ రీడబుల్‌) పాస్‌పోర్టులుగా మార్చుకోవాల్సిందే. చేతిరాత పాస్‌పోర్టులు ఇప్పటికీ 2.50 లక్షల వరకు చలామణిలో ఉన్నట్లు హైదరాబాద్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం అధికారులు భావిస్తున్నారు. ఇవి 20 ఏళ్ల వరకు చలామణి అయ్యేట్లుగా జారీ అయ్యాయి. ఈ పాస్‌పోర్టులను నవంబర్‌ 24లోపు మెషిన్ రీడబుల్‌ పాస్‌పోర్ట్‌లుగా మార్చుకోవాలని అధికారులు సర్క్యులర్‌ జారీచేశారు. వివరాల కోసం www.passportindia.gov.in  వెబ్‌సైట్‌లో కానీ, నేషన్ కాల్‌ సెంటర్‌(1800-258-1800) టోల్‌ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Friday, 26 August 2016

ఆధార్ కార్డ్‌‌కు సంబంధించి కొత్తగా చేర్చిన 20 అంశాలి

          ఇప్పటి వరకు కొన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే కార్యక్రమాలకు ఆధార్‌ కార్డును పరిమితం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరో 20 అంశాలలో ఆధార్‌ తప్పని సరి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాదికార సంస్థ (యుఐడీఏఐ) దీనిని పరిశీలిస్తుంది. గత ఏడాది సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఆరు ప్రభుత్వ పథకాలకు మాత్రమ ఆధార్‌ను పరిమితం చేసింది. ఈ ఏడాది మొదటిలో ఆధార్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. భారత విశిష్ట గుర్తిం పు ప్రాదికార సంస్థ భావిస్తోంది, మరిన్ని రంగాలకు విస్తరించాలని - వివిధ అంశాలను దేశ వ్యాప్తంగా Aadhar పరిధిలోకి తెచ్చారు. 
  • బ్యాంక్‌ ఖాతాలు
  • స్వచ్ఛంద సంస్థల ఏర్పాటు
  • స్విమ్‌ కార్డు కొనుగోలు
  • ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ కనెక్షన్‌
  • ఆస్తి కొనుగోళ్లు
  • వాహనాల అమ్మకాలు, కొనుగోలు
  • ఓటరు కార్డుకు దరఖాస్తులు
  • భూమి రికార్డులకు
  • పాఠశాలలు, కళాశాలల్లో చేరే సమయం
  • యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషనల్‌
  • (ఎస్‌ఎస్‌సీ) పోటీ పరీక్షలు రాయడానికి
  • పాస్‌పోర్ట్‌ దరఖాస్తు
  • ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)
  • ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌)
  • ఆదాయ పన్ను వివరాల దాఖలు
  • శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌ కార్డు)
  • జీవిత బీమా పాలసీ
  • హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (ఆరోగ్య బీమా)
  • యాక్సిడెంట్‌ బీమా (ప్రమాద బీమా)
  • క్రాప్‌ ఇన్సూరెన్స్‌ (పంటల బీమా)
  • నగదు బదిలీ (మనీ ట్రాన్స్‌ఫర్‌)
  • ప్రభుత్వ పథకాల సబ్సిడీ
  • బ్యాంక్‌ మిత్రగా చేరడానికి.
  • దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి
  • కార్మిక శాఖ గుర్తింపు కార్డు
  • ఎంప్లాయిమెంట్‌ నమోదు
  • బ్యాంక్‌, పోస్టాఫీసుల్లో ఖాతాల ప్రారంభానికి
  • మీసేవా కేంద్రాల్లో ఏ ధ్రువీకరణ పత్రానికి
  • దరఖాస్తు చేసినా ఆధార్‌ కార్డు ఉండాలి....
  • బ్యాంక్‌ ఏటీఎం కార్డు
  • బ్యాంక్‌లో బంగారం రుణాలు
  • భూమి తాకట్టుపై రుణాలు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంస్థల నుంచి తీసుకునే రుణాలు
  • డ్వాక్రా సంఘాల రుణాలు
  • విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌
  • ఎన్టీఆర్‌ వైద్యసేవ

Saturday, 30 July 2016

జవహర్‌ నవోదయ విద్యాలయలో 2017-18లో ఆరోతరగతిలో ప్రవేశానికి 2017 జనవరి 8వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు  ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ శాల ల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. 2016 సెప్టెంబర్‌ 16తో దరఖాస్తుల గడువు ముగుస్తుందన్నారు. విద్యార్థులు 2004 మే 1 నుంచి 2008 ఏప్రియల్‌ 30 మధ్య జన్మించినవారై ఉండాలన్నారు. దరఖాస్తులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎనవిఎస్‌హెచక్యు.ఒఆర్‌జి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జెఎనవిజియుఎనటియుఆర్‌.ఎన్ ఐసి.ఇన వెబ్‌ సైట్‌లలో డౌనలోడ్‌ చేసుకోవచ్చునన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి, మద్దిరాల జవహర్‌ నవోదయ విద్యాలయ కార్యాలయాలలో కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా ఆయా మండలాల ఎంఈవో కార్యాలయాలలో అందజేయాలన్నారు

Friday, 22 July 2016

మనమందరం అర్ధులమే...మనమేపని చేసినా దానికి ప్రతిఫలం కోరుకుంటాము. మనమందరం ఒకరకంగా చెప్పాలంటే వ్యాపారస్థుల వంటివారాం. మనకు అన్నిటిలో వ్యాపారదృష్టి. అన్నిటిలోనూ ఇచ్చిపుచ్చుకుందాం అనుకుంటాం...మనం ప్రతిపనిలోనూ ప్రతిఫలాన్ని ఆశించడం వలన ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాం. ప్రేమకు ప్రతిఫలంగా దు:ఖం సంప్రాప్తమవుతుంది అనుకుంటాం. అయితే అది మనం ప్రేమించడం వలన కాదు, ప్రేమకు ప్రతిఫలంగా మనం మరల ప్రేమను ఆశించడం వలన.
ఆశలేని చోట దు:ఖం లేదు...కోర్కెనుండే, ఆశ నుండే సమస్త దు:ఖాలు పుడుతున్నాయి. నిజమైన విజయం లోనూఒ నిజమైన సౌఖ్యం లోనూ గల రహస్యమిది. ఎవరు ప్రతిఫలమాశించరో, ఎవరు సంపూర్ణంగా నిస్వార్ధులో వారు అందరికంటే అధిక విజయవంతులు.
మనం చేసే సేవ, కర్తవ్యం ఏదైతే ఉందో, దానివలన ఏ ప్రతిఫలం ఏం వస్తుందో ఆశించవద్దు..నిస్వార్ధంగా నువ్వు చేయవలసినది చేయాలనుకున్నది చేసేయ్యి.. నిస్వార్ధంగా చేసినప్పుడు నీకు ఉపయోగకరమైనది ఏదో నీవద్దకు సరి అయిన సమయంలో వేయింతలుగా నీ వద్దకు వస్తుంది. ఆ వచ్చే ప్రతిఫలం మీద నీ దృష్టి ఉండకూడదు.
సూర్యుడు సముద్రం నుండి నీటిని గ్రహిoచి, మనకు వర్షరూపంలో మంచి నీటిని తిరిగి ఇవ్వడానికే...చెట్లు చిగిర్చి, ఎన్నో వానలకు, తుఫానులకు తట్టుకొని, జీవిస్తున్నది మనకు ఫలాలనియ్యడానికే...ప్రకృతిలో దొరికేదాన్ని ఉచితంగా ఉపయోగించుకుంటున్న మనం మరల నిస్వార్ధంగా ప్రకృతికి గాని, మనం నివసించే సమాజానికి కాని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇవ్వడానికి మనసా వాచా కర్మణా సిధ్ధం కావాలి.....

Sunday, 3 July 2016

Ramamurthynagar Park Opening on 03/07/2016

https://www.facebook.com/photo.php?fbid=1097385903637536&set=pcb.1097391326970327&type=3&theater

Wednesday, 29 June 2016

on 3rd July 2016 Ramamurthynagar Park (mini) it was developed by the association located at mini-bypass road (northern side reserve place) will be inaugurate by the Mayor,Nellore Municipal Corporation at 10 a.m.

Tuesday, 28 June 2016

హైదరాబాద్ : కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌కు చెందిన భవనాన్ని కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. భవనంలో ఉన్న కార్పోరేట్ కాలేజీని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. చింతల్‌‌లో ఎమ్మెల్యేకు పలు అక్రమాస్తులున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొద్ది రోజులుగా విచారించిన హైకోర్టు ఈరోజు స్పష్టమైన తీర్పును ఇచ్చింది. అక్రమకట్టడాలు ఎక్కడున్నా వాటిపై చర్యలు తీసుకోవాల్సిందే అని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే చింతల్ హైదర్‌గూడ‌ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేకు చెందిన భవనాన్ని వెంటనే కూల్చివేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.27/06/2015