Thursday, 24 November 2016

పెద్ద నోట్ల రద్దు వల్ల భవిష్యత్‌లో నగదు రహిత లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. సామాన్యుడి నుంచి మొదలుకొని  అందరూ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా  చెల్లింపులు చేస్తారు.కనుక బ్యాంకు లావాదేవీలు చేసేటప్పుడు, ఏటీఎమ్‌లలో, ఇతర ప్రదేశాలలో కార్డ్స్ ఉపయోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.నగదు రహిత లావాదేవీలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలని సాంకేతిక నిపుణులు  సూచిస్తున్నారు. 

  • మీ బ్యాంకు ఖాతాను అప్‌గ్రేడ్‌ చేసుకోండి! అందుకు ఫలానా లింక్‌ క్లిక్‌చేయమంటూ ఎస్‌ఎమ్‌ఎస్‌, మెయిల్‌ ద్వారా మనకు సందేశం పంపిస్తారు. ఆ లింక్‌ క్లిక్‌ చేశామంటే, అంతే! మన బ్యాంకు సంబంధించిన వివరాలన్నీ వారికి చేరినట్లే. ఈ మధ్యకాలంలో ఇలాంటి హ్యాకింగ్స్‌ ఎక్కువ జరుగుతున్నాయి. వీటిని ఫిషింగ్‌ అటాక్‌ అంటారు. బ్యాంకులు ఖాతాకు సంబంధించిన స్టేట్‌మెంట్‌తప్ప మరేవీ పంపవన్న సంగతి గుర్తించాలి. ఆ మెసేజ్‌ల పట్ల అప్పమత్తంగా ఉండాలి.
  • మొబైల్‌లో పైరసీ, పొర్నోగ్రఫీ చిత్రాలు డౌన్‌లోడ్‌ చేయడం మంచిదికాదు. వాటిద్వారా హ్యాకర్లు ప్రవేశించి మీ సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది.
  • ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసేప్పుడు అక్కడ హెచ్‌టీటీపీని మాత్రమే సెలక్ట్‌చేయాలి. ఒకవేళ హెచ్‌టీటీపీఎస్‌ ఉంటే కనుక, అది నకిలీఅని అర్థం.
  • ఇంటర్‌నెట్‌ సెంటర్ల ద్వారా నెట్‌ బ్యాంకింగ్‌ వినియోగించడం మంచిది కాదు.
  • కొన్ని ఏటీఎం సెంటర్లలో స్కిమ్మర్స్‌ అనే చిన్న డివైజ్‌ అమర్చి, కార్డు వివరాలన్నింటినీ తస్కరిస్తున్న హ్యాకర్లు ఉన్నారు. చిన్న గల్లీలు, జనావాసం తక్కువగా ఉండే ప్రాంతాల్లోని ఏటీఎంలను వాడేప్పుడు జాగ్రత్త వహించాలి.
  • ఓటీపీ లేకపోయినా హ్యాకర్లు మన ఖాతాను ఖాళీచేసే అవకాశం ఉంటుందని గుర్తించాలి.
  • గతేడాది 32లక్షల డెబిట్‌కార్డులను చైనాకు చెందిన ఓ ముఠా హ్యాకింగ్‌ చేసింది. దాంతో బ్యాంకులన్నీ కొత్తకార్డులు జారీచేశాయి.
  • ప్రతిరోజూ లేక కనీసం రెండు రోజుల కొకసారి అకౌంట్‌ చెక్‌ చేసుకోవడం మంచిది.
  • ఒకసారి డబ్బు మన ఖాతాదాటిందంటే, పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప మరేమీ చేయలేం.
  • ఇతర దేశాల్లో, రాష్ట్రా‌ల్లో నుంచి హ్యాకింగ్‌ చేస్తున్నారు. వారిని పట్టుకోవడం చాలా కష్టతరం కూడా. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం అప్రమత్తంగా ఉండటమే చాలా అవసరం.

No comments: