Wednesday, 1 February 2017

రాత్రి సమయంలో మీరు కారులో వెళ్తుండగా మీకారు అద్దంపై కోడిగుడ్డు పడిందా? అయితే ఎట్టి పరిస్తితుల్లోను మీరు కారు ఆపవద్దని  పోలీసులు చెబుతున్నారు. అంతేకాక వైపర్ ఆన్ చేసి నీటితో కారు గ్లాసు (అద్దం) శుభ్రం చేయాలని ప్రయత్నించొద్దని కూడా వారు హెచ్చరిస్తున్నారు. అలా ప్రయత్నిస్తే కోడిగుడ్డులోని రసాయనాలు నీటితో కలయొక చెంది అద్దంపై నల్లటి పొర ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో వెంటనే అంతా చీకటిగా తయారయి, బయట ఏమీ కనబడదని, అప్పుడు తప్పనిసరిగా కారు ఆపవలసి వస్తుందని, ఆ వెంటనే దారి దొపిడీ దొంగలు మీ మీద దాడి చేసి మీ విలువైన వస్తువులు, నగదు దోపిడీ చేసే అవకాశం వుందని వారు హెచ్చరిస్తున్నారు. కావున జాగ్రత్త ఇలాంటి సంఘటనలు ఎదురైతే కాస్త జాగ్రత్తగా వ్యవహరించి దోపిడీదారులకు చిక్కకుండా తప్పించుకోవాలని  పోలీసులు సూచించారు.

No comments: