Saturday, 30 July 2016

జవహర్‌ నవోదయ విద్యాలయలో 2017-18లో ఆరోతరగతిలో ప్రవేశానికి 2017 జనవరి 8వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు  ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ శాల ల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. 2016 సెప్టెంబర్‌ 16తో దరఖాస్తుల గడువు ముగుస్తుందన్నారు. విద్యార్థులు 2004 మే 1 నుంచి 2008 ఏప్రియల్‌ 30 మధ్య జన్మించినవారై ఉండాలన్నారు. దరఖాస్తులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎనవిఎస్‌హెచక్యు.ఒఆర్‌జి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జెఎనవిజియుఎనటియుఆర్‌.ఎన్ ఐసి.ఇన వెబ్‌ సైట్‌లలో డౌనలోడ్‌ చేసుకోవచ్చునన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి, మద్దిరాల జవహర్‌ నవోదయ విద్యాలయ కార్యాలయాలలో కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా ఆయా మండలాల ఎంఈవో కార్యాలయాలలో అందజేయాలన్నారు

No comments: