Friday, 22 July 2016

మనమందరం అర్ధులమే...మనమేపని చేసినా దానికి ప్రతిఫలం కోరుకుంటాము. మనమందరం ఒకరకంగా చెప్పాలంటే వ్యాపారస్థుల వంటివారాం. మనకు అన్నిటిలో వ్యాపారదృష్టి. అన్నిటిలోనూ ఇచ్చిపుచ్చుకుందాం అనుకుంటాం...మనం ప్రతిపనిలోనూ ప్రతిఫలాన్ని ఆశించడం వలన ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాం. ప్రేమకు ప్రతిఫలంగా దు:ఖం సంప్రాప్తమవుతుంది అనుకుంటాం. అయితే అది మనం ప్రేమించడం వలన కాదు, ప్రేమకు ప్రతిఫలంగా మనం మరల ప్రేమను ఆశించడం వలన.
ఆశలేని చోట దు:ఖం లేదు...కోర్కెనుండే, ఆశ నుండే సమస్త దు:ఖాలు పుడుతున్నాయి. నిజమైన విజయం లోనూఒ నిజమైన సౌఖ్యం లోనూ గల రహస్యమిది. ఎవరు ప్రతిఫలమాశించరో, ఎవరు సంపూర్ణంగా నిస్వార్ధులో వారు అందరికంటే అధిక విజయవంతులు.
మనం చేసే సేవ, కర్తవ్యం ఏదైతే ఉందో, దానివలన ఏ ప్రతిఫలం ఏం వస్తుందో ఆశించవద్దు..నిస్వార్ధంగా నువ్వు చేయవలసినది చేయాలనుకున్నది చేసేయ్యి.. నిస్వార్ధంగా చేసినప్పుడు నీకు ఉపయోగకరమైనది ఏదో నీవద్దకు సరి అయిన సమయంలో వేయింతలుగా నీ వద్దకు వస్తుంది. ఆ వచ్చే ప్రతిఫలం మీద నీ దృష్టి ఉండకూడదు.
సూర్యుడు సముద్రం నుండి నీటిని గ్రహిoచి, మనకు వర్షరూపంలో మంచి నీటిని తిరిగి ఇవ్వడానికే...చెట్లు చిగిర్చి, ఎన్నో వానలకు, తుఫానులకు తట్టుకొని, జీవిస్తున్నది మనకు ఫలాలనియ్యడానికే...ప్రకృతిలో దొరికేదాన్ని ఉచితంగా ఉపయోగించుకుంటున్న మనం మరల నిస్వార్ధంగా ప్రకృతికి గాని, మనం నివసించే సమాజానికి కాని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇవ్వడానికి మనసా వాచా కర్మణా సిధ్ధం కావాలి.....

No comments: