Saturday, 17 October 2015

  • స్మార్ట్‌ సిటీగా నెల్లూరును  కేంద్రం ప్రకటించినది
 స్మార్ట్‌ సిటీల జాబితాలో నెల్లూరు నగరం చేరింది.కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారి చొరవతో స్మార్ట్‌ సిటీ సాధ్యమైంది.  దేశవ్యాప్తంగా తొలి జాబితాలో 100 స్మార్ట్‌ సిటీలను ఇటీవల కేంద్రం ప్రకటించింది.అందులోనెల్లూరు నగరానికి  అవకాశం దక్కలేదు. 
  ఇప్పుడు నెల్లూరును స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చడంతో నగరానికి మహర్దశ పట్టనుంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్ననెల్లూరు నగర పాలక సంస్థకు  దాదాపు రూ.500 కోట్లు నగరానికి రానున్నాయి. ఇవి కాక కేంద్రం ఇతర సంస్థల నుంచి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భూగర్భ డ్రైనేజి, తాగునీటి పథకాలు మంజూరై ఉండడం, తాజాగా స్మార్ట్‌ సిటీ నిధులతో నగర రూపురేఖలు మారుతాయని నెల్లూరు నగర ప్రజల ఆకాంక్ష చొరవ చూపి స్మార్ట్ సిటి సాధించిన కేంద్ర - రాష్ట్ర మంత్రులు
శ్రీ M వెంకయ్యనాయుడు గారికి మరియు డా:P నారాయణ గారికి ధన్యవాదాలు

No comments: