Sunday, 19 March 2017

దొంగతనాల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
 టూర్లకు, ఊర్లకు వెళ్లేవారు విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లాలి.
 తాళం చెవి ఇంటి పరిసర ప్రాంతాలలో పెట్టకూడదు.
 ఇంటి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలి.
దూర ప్రాంతాలకు, ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు
తప్పకుండా సంబంధిత PS పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
 అనుమానాస్పద వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు.
 బంగారాన్ని మెరుగు పెడతామని చెప్పేవారిని నమ్మొద్దు.
 మహిళలు ఒంటరిగా బయటకు వెళ్తే మెడచుట్టూ కొంగును, ప్రత్యేక వస్త్రంతో కనిపించకుండా ఉంచాలి.
 విలువైన వస్తువుల సమాచారాన్ని ఇతరులకు చెప్పకూడదు.
 ఆరుబయట వాహనాలకు హాండిల్‌లాక్‌తో పాటు వీల్‌ లాక్‌ వేయాలి.
 గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్‌, పాలవారిని రావద్దని చెప్పాలి.
సమీపస్తులను గానీ పని మనుషులను గానీ ప్రతీరోజు వాకిలి ఊడ్చమని చెప్పాలి.
 ఇళ్ల ముందు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
 నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి,
ఇరుగుపొరుగు వారికి మీ మొబైల్ నెంబరు ఇవ్వడం మంచిది
 టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి.
కొత్త వ్యక్తుల కదళికలపై 100 డయల్‌ లేదా 9390777727,9440796311 పోలీసు వాట్సాప్‌ నెంబర్‌కు
సమాచారం ఇవ్వాలి.

No comments: