Monday, 1 December 2014

ల్యాప్‌టాప్.. నేటి ఆధునిక కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేస్తోంది. అయితే ల్యాప్‌టాప్‌ను శరీరం పై పెట్టుకుని ఉపయోగించటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ల్యాప్‌టాప్ ద్వారా వెలువడే వేడి ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి కారణంకాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడి శరీరాన్ని నల్లగా మార్చటంతో పాటు, చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు కేసుల్లో నిర్థారించటం జరిగింది.


No comments: