Friday, 9 September 2016

‘చేతిరాత’ పాస్‌పోర్టు మార్చుకోవాల్సిందే! 
ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సర్క్యులర్‌ 
హైదరాబాద్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): చేతిరాతతో ఉన్న పాస్‌పోర్టులను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్(మెషిన్ రీడబుల్‌) పాస్‌పోర్టులుగా మార్చుకోవాల్సిందే. చేతిరాత పాస్‌పోర్టులు ఇప్పటికీ 2.50 లక్షల వరకు చలామణిలో ఉన్నట్లు హైదరాబాద్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం అధికారులు భావిస్తున్నారు. ఇవి 20 ఏళ్ల వరకు చలామణి అయ్యేట్లుగా జారీ అయ్యాయి. ఈ పాస్‌పోర్టులను నవంబర్‌ 24లోపు మెషిన్ రీడబుల్‌ పాస్‌పోర్ట్‌లుగా మార్చుకోవాలని అధికారులు సర్క్యులర్‌ జారీచేశారు. వివరాల కోసం www.passportindia.gov.in  వెబ్‌సైట్‌లో కానీ, నేషన్ కాల్‌ సెంటర్‌(1800-258-1800) టోల్‌ ఫ్రీ నంబర్‌లో సంప్రదించాలన్నారు.

No comments: