అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తూ తెలుగులో ఉత్తర్వును జారీ చేసింది. భాషాభివృద్ధి కమిటీ సభ్యులుగా మండలి బుద్దప్రసాద్, పరకాల ప్రభాకర్, నాగులపల్లి శ్రీకాంత్, జీవీ రామకృష్ణారావు, విజయభాస్కర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి శిలాఫలకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పేర్లు తెలుగులోనే ఉండాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండాలని యజమానులను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు భాషా అభిమానులు, సాహితీ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment