ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపిఎస్‌ఎల్‌పిఆర్‌బి)- ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మాట్రన్ ఉద్యోగాల భర్తీకోసం భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పలు విభాగాల వారీగా పురుషులకు, మహిళలకు కేటాయించిన ఖాళీలను ప్రకటించారు. మొత్తమ్మీద 707 పోస్టులు ఉన్నాయి.
విభాగాలు - ఖాళీలు
స్టయిపెండరీ క్యాడెట్ ట్రైనీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) విభాగంలో 355 పోస్టులు, స్టయిపెండరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎఆర్) విభా గంలో 113 పోస్టులు ఉన్నాయి. వీటికి పురుషులు, మహి ళలు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుషులకు మాత్ర మే స్టయిపెండరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎఆర్ సిపిఎల్) విభాగంలో 9 ఖాళీలు, స్టయిపెండరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎపిఎస్పీ) విభాగంలో 209 ఖాళీలు ఉన్నాయి. ప్రిజన్స్ ్క్ష కరెక్షనల్ సర్వీసెస్ విభాగంలో డిప్యూటీ జైలర్ పోస్టుకు సంబంధించి పురుషులకు 16, అసిస్టెంట్ మ్యాట్రన్‌గా మహిళలకు 5 పోస్టులు ఉన్నాయి.
No comments:
Post a Comment