Sunday, 25 September 2016

రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే బ్రాహ్మణులకు ఐదు కోట్ల రూపాయల వరకూ రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని, ఇందుకు బ్యాంకర్లు కూడా సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. బ్రాహ్మణులకు అభివృద్దికి బ్యాంక్‌లు సహకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ నుంచి 3103 మంది పేదలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 360 మందికి రుణసౌకర్యం కల్పించడంలో బ్యాంకర్లు సహకరించాలని కృష్ణారావు కోరారు.

No comments: